Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మార్క్‌రమ్ మామ.. ఏం గుండె రా నీది!

Aiden Markram: సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా అతను చూపిన ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ముఖ్యంగా డబుల్ సూపర్ ఓవర్‌ను స్పిన్నర్‌తో వేయించడాన్ని ప్రశంసిస్తున్నారు. సాధారణంగా స్పిన్నర్‌‌కు డెత్ ఓవర్లలోనే బౌలింగ్ ఇవ్వరు.. అలాంటిది మార్క్‌రమ్ ఏకంగా స్పిన్నర్‌తో డబుల్ సూపర్ ఓవర్ వేయించాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే కనివీని ఎరుగని రీతిలో సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు సమ ఉజ్జీలుగా తలపడటంతో ఒకటి కాదు.. రెండు సూపర్ ఓవర్లతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. అనుభవంతో సౌతాఫ్రికా డబుల్ సూపర్ ఓవర్‌లో గట్టెక్కగా.. అత్యుత్సాహంతో అఫ్గానిస్థాన్ ఓటమిపాలైంది. ఫలితం ఏదైనా.. విజయం ఎవరిని వరించినా.. ఈ మ్యాచ్‌ మాత్రం చరిత్రకెక్కింది. అభిమానుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

Netizens Hail Aiden Markram Bold Call to Trust Keshav Maharaj in Thrilling Double Super Over

స్పిన్నర్‌తో సూపర్ ఓవర్..

గ్రూప్-డీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌ను ఎయిడెన్ మార్క్‌రమ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌తో వేయించాడు. 23 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మార్క్‌రమ్.. కేశవ్ మహరాజ్‌ను ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మార్క్‌రమ్ ఘోర తప్పిదం చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ తొలి బంతిని డాట్ చేసిన మహరాజ్.. రెండో బంతికి నబీని క్యాచ్ ఔట్ చేశాడు. గుర్బాజ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది ఉత్కంఠను రేపాడు.

ఆఖరి బంతికి అఫ్గాన్ విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. మహరాజ్ వైడ్ వేసాడు. దాంతో అదనపు పరుగు రావడంతో పాటు మరో బంతి వేయాల్సి వచ్చింది. కానీ ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మహరాజ్.. గుర్బాజ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి సౌతాఫ్రికా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అతనిపై కెప్టెన్ మార్క్‌రమ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఏం గుండె రా నీది..

ఈ క్రమంలోనే మార్క్‌రమ్‌ను క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. మహరాజ్‌కు బంతినిచ్చి మ్యాచ్ గెలిపించాడని ప్రశంసిస్తున్నారు. 'మార్క్‌రమ్ మామ.. ఏం గుండె రా నీది'అని అతని ధైర్యాన్ని కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం హోస్ట్ రవి శాస్త్రి స్పిన్నర్‌తో డబుల్ సూపర్ ఓవర్ వేయించడంపై ప్రశ్నించగా.. అతన్ని తాను నమ్మానని బదులిచ్చాడు.

'సూపర్ ఓవర్‌లో సాధారణంగా ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసే బౌలర్‌కే బంతిని ఇస్తాం. లూంగి ఎంగిడి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చిన్న పొరపాట్లు చేసినా.. మ్యాచ్ చేజారుతుంది. అంతర్జాతీయ స్థాయిలో గెలుపోటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. కేశవ్ మహారాజ్ విషయానికొస్తే.. స్పిన్నర్‌గా అంత చిన్న గ్రౌండ్‌లో బౌలింగ్ చేయడం కష్టం. కానీ అతను మా కోసం పని పూర్తి చేస్తాడని మేం నమ్మాం.'అని మార్క్‌రమ్ తెలిపాడు.

Story first published: Thursday, February 12, 2026, 7:05 [IST]
Other articles published on Feb 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+