Vamika: ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం.. అదిమిపట్టిన అనుష్క.. కన్నెర్ర చేసిన కోహ్లీ!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముద్దుల తనయ వామిక పట్ల ఫొటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్... సుమారు మూడున్నర నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు బుధవారం అర్థరాత్రి ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

చిన్నారే లక్ష్యంగా...
అయితే విరుష్క కూతరు వామికా కోసం ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిన్నారినే టార్గెట్ చేస్తూ తమ కెమెరాలను క్లిక్‌మనిపించారు. దాంతో ఫొటో జర్నలిస్టుల కంట తన బిడ్డ ముఖం పడకుండా అనుష్క వామికా ముఖాన్ని గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది. మరోవైపు విరాట్ కోహ్లీ ఫొటోగ్రాఫర్ల వైపు సిరీయస్‌గా చూశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ చిన్నారి ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినబడదా? అంటూ ఫొటోగ్రాఫర్లపై మండిపడుతున్నారు.

ఎంత చెప్పినా..?
చిన్నపిల్లలపై ఫ్లాష్ ప్రభావం ఉంటుందనే ఇంగిత జ్ఞానం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా అలానే ఫొటోలు తీసేందుకు సిగ్గుండాలని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం కారణంగా ఆ బిడ్డకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఫైర్ అవుతున్నారు.
ఇక వామికా పుట్టిన సందర్భంగానే పప్పరాజీలు(ఫొటోగ్రాఫర్లకు) తమ కూతురి ప్రైవసీ భంగం కలిగించకుండా ఉండాలని, ఫొటోలు తీయవద్దని విరుష్క జోడీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను అన్ని మీడియా హౌజ్‌లకు పంపించింది. వారి రిక్వెస్ట్‌ను బేఖాతరు చేసిన ఫొటోగ్రాఫర్లపై గతంలో అనుష్క ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు వామికా ముఖం కనిపించేలా ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.

అందుకే ఫొటోలు షేర్ చేయడం లేదు..
తన కూతురు 'వామికా' ఫొటోలు బయటపెట్టకపోవడానికి గల కారణాన్ని కోహ్లీ ఇటీవల అభిమానులతో పంచుకున్నారు. 'In quarantine..Ask me your questions'అనే క్యాప్షన్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఓ అభిమాని అసలు 'వామికా' అంటే అర్థం ఏంటని? ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించాడు. దీనికి విరాట్ స్పందిస్తూ.. వామికా అంటే దుర్గాదేవి అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని స్పష్టం చేశాడు.

ఆందోళన లేదు..
ఈ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయని తెలిపాడు. 'ఈ పర్యటన కోసం మేం సరిగా సన్నద్ధం కాలేదనే అంశం గురించి ఎలాంటి ఆందోళన లేదు. సిరీస్ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు ప్రత్యర్థి దేశంలో అడుగు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలా వెళ్లి కూడా సిరీస్‌లో హోరాహోరీగా తలపడ్డాం. కాబట్టి ఇదంతా మాకు తెలుసు. ఇంగ్లండ్‌లో మొదటిసారి ఆడటం లేదు. అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా సరైన మానసిక దృక్పథంతో మైదానంలోకి అడుగు పెట్టడం ముఖ్యం. లేదంటే తొలి బంతికే అవుట్ కావచ్చు లేదా వికెట్లు తీయడం అసాధ్యంగా మారిపోవచ్చు.'అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications