Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hardik Pandya జట్టుకు పనికారాడు.. మరో ఆల్‌రౌండర్‌ను చూసుకోవాల్సిందే! నెటిజన్ల ఫైర్!

Netizens disappointed as Hardik Pandya’s poor form continues

హైదరాబాద్: టీమిండియా ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఏ మాత్రం భారత జట్టుకు పనికిరాడని, వీలైనంత త్వరగా మరో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను రెడీ చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పర్యటనలోని మూడు వన్డేల సిరీస్‌లో హార్దిక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అభిమానులు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఆడుతున్న పాండ్యాను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకుంటే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

రెండు మ్యాచ్‌ల్లో విఫలం..

తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం పాండ్యాకు రాలేదు. కానీ రెండో వన్డేలో డకౌట్ అయిన పాండ్యా.. తాజా మ్యాచ్‌లో 17 బంతుల్లో 19 రన్స్ చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ఇక బ్యాటింగే అంటే.. బౌలింగ్‌లోనూ హార్దిక్ రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 5 ఓవర్లు వేసి ఓ వికెట్ తీసిన పాండ్యా రెండో వన్డేలో 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. తాజా మ్యాచ్‌లోను ఓ వికెట్ తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అయితే పాండ్యా బౌలింగ్ వేగం కూడా చాలా తగ్గింది. టీ20 ప్రపంచకప్ ముందు పాండ్యా వైఫల్యం భారత క్రికెట్ వర్గాలను కలవరపెడుతోంది.

పాండ్యా నీ వల్ల ఉపయోగమేమి..

ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. పాండ్యా వల్ల జట్టుకు ఒరిగేదేమి లేదని, టీమ్‌కు భారమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. వరుసగా అవకాశాలిస్తున్న అతను విఫలమవుతున్నాడనంటున్నారు. పాండ్యాకు ఇచ్చిన అవకాశాలు చాలని, పక్కనపెట్టి ఇతర ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని సూచిస్తున్నారు. కొందరైతే.. పాండ్యాను కొన్నాళ్లు దూరంపెట్టాలని అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ విలువ ఏంటో తెలుస్తుందంటున్నారు. ఏదీ ఏమైనా పాండ్యా పెర్ఫామెన్స్ మరీ తీసికట్టుగా ఉందని విమర్శిస్తున్నారు.

చెతులేత్తేసిన గబ్బర్ సేన..

చెతులేత్తేసిన గబ్బర్ సేన..

అకిలా ధనుంజయ(3/44), ప్రవీణ్ జయవిక్రమార్క(3/59) చెలరేగడంతో ఆఖరి వన్డేలో భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు కుప్పకూలింది. జట్టులో 6 మార్పులు చేసిన గబ్బర్ సేన మూల్యం చెల్లించుకుంది. పృథ్వీ షా(49 బంతుల్లో 8 ఫోర్లు 49), సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 7 ఫోర్లతో 40) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్లుకు అండగా పేసర్లు చమీరా(2/55), కరుణరత్నే(1/25) రాణించడంతో గబ్బర్ సేన చేతులెత్తేసింది. కెప్టెన్ డసన్ షనకకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక విజయానికి చేరువైంది.

Story first published: Friday, July 23, 2021, 23:08 [IST]
Other articles published on Jul 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+