Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌత్ ఇండియా X నార్త్ ఇండియా మధ్య చిచ్చు రేపిన ధోనీ గిఫ్ట్! జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో..

Netizens controversial comments on MS Dhoni gifts signed cricket bat to Yogi Babu

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన ఓ గిఫ్ట్ సౌత్ ఇండియా-నార్త్ ఇండియా మధ్య చిచ్చు రేపింది. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి దారి తీసింది. రెండుగా విడిపోయిన అభిమానులు గత రెండు రోజులుగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఘాటు పదాలతో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఈ తరహా ప్రవర్తన ఏ మాత్రం సరి కాదని, ఇది దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని భారత పౌరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్, నార్త్ తేడా ఉండవద్దని, ప్రాంతీయ వివక్షను కనబర్చవద్దని సూచిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీకి తమిళనాడుతో విడదీయని బంధం ఉంది. అక్కడి ప్రజలు తాళా అంటూ ధోనీని ముద్దుగా పిలుచుకుంటారు. గత 16 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ధోనీ.. అక్కడి వ్యక్తిలానే భావిస్తారు. ఇటీవలే సినిమా ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన ధోనీ.. తమిళంలో ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.

ఆ సినిమాలో తమిళ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నాడు. యోగి బాబు.. ధోనీ అంటే పిచ్చి. ఈ విషయం తెలుసుకున్న ధోనీ అతనికి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా పంపించాడు.

బెస్ట్ విషెస్ అంటూ..

బెస్ట్ విషెస్ యోగి బాబు అని రాసి, తన సంతకం చేసిన బ్యాట్‌ను ఇచ్చాడు. ఈ ఫొటోను యోగి బాబు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన బ్యాట్‌ను తన కోసం సైన్ చేసి పంపించాడని తెలుపుతూ ఓ వీడియోను కూడా యోగి బాబు షేర్ చేశాడు. తమిళ ప్రజలతో పాటు ధోనీ అభిమానులు కూడా యోగి బాబుకు అభినందనలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్‌ నుంచి బ్యాట్ అందుకున్నావని ప్రశంసించారు. మరికొందరు యోగి బాబు మంచి నటుడని, సౌతిండియాలో బెస్ట్ కమెడియన్ అంటూ కొనియాడారు.

మా పూర్వీకులు..

ఓ నెటిజన్ మాత్రం దక్షిణాది ప్రజలను ఉద్దేశిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. 'దక్షిణాది వారందరు ఎందుకు నల్లగా ఉంటారు?.'అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌తో చిర్రెత్తుకుపోయిన ఓ సౌతిండియన్ నెటిజన్ జుగ్సుపాకరమైన రీతిలో బదులిచ్చాడు. తమ పూర్వీకులు బ్రిటీషర్లను ఇళ్లలోకి రానివ్వలేదని, అందుకే నల్లగా ఉన్నామని కౌంటరిచ్చాడు. దాంతో ఈ వ్యవహారం పెద్దదై ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి చేరింది. సౌతిండియాపై నార్త్ ఇండియన్స్ వివక్ష చూపడం ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో వారి వివక్షను బయటపెట్టారు.

Story first published: Saturday, February 18, 2023, 10:27 [IST]
Other articles published on Feb 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+