Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపక్ చాహర్ రిసెప్షన్‌లో పాక్ క్రికెటర్.. ఎవడు పిలిచాడంటూ ఫ్యాన్స్ ఫైర్! కానీ..

 Netizens confuse Khaleel Ahmed with Hasan Ali at Deepak Chahar’s reception

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్‌ 1న ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో దీపక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్‌కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఏడాది పాటు ఈ జంట ప్రేమ మత్తులో మునిగి తేలింది. గాయంతో దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్‌కు బ్రేక్ రావడంతో వివాహం చేసుకున్నారు.

 రిసెప్షన్‌కు హాజరైన ఆటగాళ్లు..

రిసెప్షన్‌కు హాజరైన ఆటగాళ్లు..

ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న దీపక్ చాహర్.. సహచర ఆటగాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లి రిసెప్షన్‌కు భారత యువ ఆటగాళ్లు చాలా మంది హాజరయ్యారు. వారిలో రిషభ్ పంత్, కర్ణ్ శర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్ తదితరులంతా వచ్చి చాహర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌కు సంప్రదాయ పఠానీ కుర్తాలో వచ్చిన వ్యక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

హసన్ అలీని చూసి..

పాకిస్థాన్ ప్లేయర్ హసన్ అలీలా ఉండటంతో అతన్ని కూడా రిసెప్షన్‌కు పిలిచారా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. భారత ఆటగాళ్లకు సంబంధించి ఫొటో నెట్టింట వైరల్ కాగా.. హసన్ అలీని పోలి ఉన్న వ్యక్తి విషయంలో గందరగోళానికి గురయ్యారు. అసలు అతన్ని ఎవరు పిలిచారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.

అయితే ఆ ఫొటోను నిశితంగా పరిశీలిస్తే అతను హసన్ అలీ కాదని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన భారత్ పేసర్ ఖలీల్ అహ్మద్ అని స్పష్టమైంది. అతని వేషధారణ వల్లే ఈ కన్‌ఫ్యూజన్ వచ్చిందని మరికొందరు నెటిజన్లు వివరించారు.

గాయంతో ఆటకు దూరం..

గాయంతో ఆటకు దూరం..

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. దాంతో ఎన్‌సీఏలో చేరిన అతను గాయం నుంచి కోలుకుంటున్న దశలో మరో గాయానికి గురయ్యాడు. వెన్ను నొప్పి గాయానికి గురవ్వడంతో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ ఆ జట్టుకు తీవ్ర నష్టం చేసింది.

 హీరో కాస్త జీరోగా..

హీరో కాస్త జీరోగా..

టీ20 ప్రపంచకప్‌లో సంచలన బ్యాటింగ్‌తో ప్రశంసలు అందుకున్న హసన్ అలీ.. కీలక సెమీఫైనల్లో పాకిస్థాన్ ఓటమికి కారణమయ్యాడు. అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించిన హసన్ అలీ హీరోగా నిలిచాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై జీరోగా మిగిలిపోయాడు. కీలక సమయంలో మాథ్యూవేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేసి జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. దాంతో టైటిల్ గెలుస్తుందనుకున్న పాక్ ఇంటిదారిపట్టింది.

Story first published: Monday, June 6, 2022, 16:47 [IST]
Other articles published on Jun 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+