Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపక్ .. హనీమూన్‌లో నీ నడుము జాగ్రత్త.. అసలే ప్రపంచకప్ ఉంది.! చాహర్ సోదరి రోత వ్యాఖ్యలు!

Netizens brutally trolls Deepak Chahars sister Malti after herhoneymoon advice

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ దీపక్‌ చాహర్‌ సోదరి, ప్రముఖ మోడల్ మాలతి చాహర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు. భారత సంప్రదాయంలో అక్క-తమ్ముడి బంధం ఎంతో విలువైనదని, దాన్ని దిగజార్చేలా మాట్లాడవద్దని మండిపడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అవుతూ.. అక్కననే విషయం మరించి రోత వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం మాలతి చాహర్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్‌ 2న దీపక్ ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కొత్త జంటకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ, సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు దీపక్‌కు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే అతని సోదరి మాలతి సైతం తమ్ముడు, మరదల్ని విష్ చేసింది. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే మాలతి.. తనదైన శైలిలో విష్ చేసి వివాదంలో చిక్కుకుంది.

హనీమూన్‌లో నడుము జాగ్రత్త అంటూ..

హనీమూన్‌లో నడుము జాగ్రత్త అంటూ..

కొత్త జంటతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె..'ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు. దీపక్ హనీమూన్‌లో నీ నడుము జాగ్రత్త. అసలే మనకు ప్రపంచకప్ ఉంది'అంటూ కొంటెగా ట్వీట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు ఓ వర్గం నెటిజన్లకు నచ్చలేదు. ఓ అక్క.. తమ్ముడి సెక్స్ లైఫ్ గురించి ఇలా బాహటంగా మాట్లాడటం సరికాదని వారు మండిపడుతున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్‌ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు.

భిన్నాభిప్రాయాలు..

భిన్నాభిప్రాయాలు..

అయినా, దీపక్‌ చాహర్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్‌ అయిపోయారా? అతని సేవలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు.. భువనేశ్వర్ ఉన్నాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు. సరదాగా ఆమె చేసిన ట్వీట్‌ను ఇంతలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.

 వెన్ను గాయంతో..

వెన్ను గాయంతో..

కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ. 14 కోట్ల భారీ ధర పలికిన దీపక్ చాహర్.. గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది. ప్రస్తుతం వెన్నుగాయంతో బాధపడుతున్న దీపక్.. పూర్తిగా కోలుకోవడానికి కనీసం మరో మూడు నెలలు పడుతుంది. ఈ క్రమంలోనే అతని సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికవ్వలేదు. అతని గాయాన్ని ఉద్దేశించే మాలతి సెటైరికల్‌‌గా ట్వీట్ చేసింది.

Story first published: Saturday, June 4, 2022, 15:47 [IST]
Other articles published on Jun 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+