For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Andre Russel ఎద్దులా ఉన్నావ్ కానీ బుద్ది లేదు.. అత్యుత్సాహం అవసరమా? స్టార్క్‌ను చూసి నేర్చుకో!

Netizens Brutally Trolls Andre Russel After Losing aginst Australia
Mitchell Starc bowls 5 dot balls, defends 10 in epic last over against Andre Russell

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన నాలుగో టీ20లో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో రస్సెల్ అత్యుత్సాహం కారణంగా విండీస్ ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన రస్సెల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. యార్కర్ బాల్స్ ఆడలేననే తన బలహీతనను మరోసారి చాటి చెప్పాడు. దాంతో రస్సెల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసినా మ్యాచ్ గెలిచేదని, రస్సెల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ఎద్దులా ఉన్నా.. రస్సెల్‌కు బుద్ది మాత్రం లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

స్టార్క్‌ను చూసి నేర్చుకో..

ఇక పరిస్థితులకు తగ్గట్లుగా స్మార్ట్‌గా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్‌ను అభిమానులు కొనియాడుతున్నారు. క్రికెట్‌లో తెలివిగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో స్టార్క్ మరోసారి నిరూపించాడని ప్రశంసిస్తున్నారు. బ్యాటింగ్‌కు ఫేవర్ అయిన టీ20 ఫార్మాట్‌లో చివరి ఓవర్‌లో 11 పరుగులు కాపాడటం ఏ బౌలర్‌కైనా కష్టమే. వరల్డ్ బెస్ట్ బౌలర్లు కూడా టీ20 ఫార్మాట్‌లో తేలిపోతుంటారు. అలాంటిది ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల రస్సెల్‌ను స్టార్క్ అడ్డుకున్నాడంటే అది కేవలం తన మైండ్ గేమ్ వల్లే సాధ్యమైంది. యార్కర్ బంతులు ఆడలేకపోవడం రస్సెల్ బలహీనత. దాంతో దానిపైనే స్టార్క్ టార్గెట్ చేశాడు. కచ్చితమైన యార్కర్లతో పాటు లో ఫుల్‌టాస్‌లతో ఉక్కిరి బిక్కిరి చేశాడు.

అమ్మాయిలపై మోజుతో..

అంతేకాకుండా రస్సెల్ లోయర్ బాడీ బలహీనంగా ఉంటుంది. ఈ విషయాన్ని అతనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అమ్మాయిలను ఆకర్షించాలనే మోజులో అప్పర్ బాడీపైనే ఎక్కువ దృష్టిపెట్టానని, దాంతో లోయర్ బాడీ బలహీనమైందన్నాడు. తన అప్పర్ బాడీని లోయర్ బాడీ మోయలేకపోతుందని కూడా చెప్పాడు. అందుకే తాను యార్కర్ బాల్స్ ఆడలేకపోతున్నానని తెలిపాడు. ఈ బలహీనతే టార్గెట్ చేసిన స్టార్క్ స్మార్ట్‌గా రస్సెల్ కాళ్లపైకే బంతులు విసిరాడు. తొలి బంతి లోయర్ ఫుల్‌టాస్ కాళ్లకు వేయగా.. బంతిని ఆడబోయిన రస్సెల్ కిందపడిపోయాడు. వరుసగా ఫుల్లర్ లెంగ్త్, లో ఫుల్‌టాస్‌లతో దాడి చేశాడు. దాంతో రస్సెల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన స్టార్క్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ ఒక్క ఓవర్‌లో మళ్లీ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

సింగిల్స్ తీసుకున్నా..

చివరి ఓవర్‌లో రస్సెల్ ఆడిన షాట్స్‌కు సునాయసంగా సింగిల్స్, డబుల్స్ వచ్చేవని కానీ అత్యుత్సాహంతో రన్స్ తీయలేదని మండి పడుతున్నారు. ఫస్ట్ బాల్‌ మిడ్ వికెట్ మీద ఆడబోయి కిందపడ్డ రస్సెల్.. కొంచెం అలర్ట్‌గా ఉంటే సింగిల్ వచ్చేదని, మిగతా బంతుల్లో కూడా డబుల్స్ వచ్చేవన్నారు. అప్పుడు చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేస్తే సరిపోయేదని, బౌలర్‌పై కూడా ఒత్తిడి ఉండేదని కానీ రస్సెల్.. భారీ షాట్లతో గెలిపిస్తాననే అత్యుత్సాహంతో జట్టును ఓడించాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

గెలిచే మ్యాచ్‌లో..

చివరి ఓవర్‌లో రస్సెల్ ఆడిన షాట్స్‌కు సునాయసంగా సింగిల్స్, డబుల్స్ వచ్చేవని కానీ అత్యుత్సాహంతో రన్స్ తీయలేదని మండి పడుతున్నారు. ఫస్ట్ బాల్‌ మిడ్ వికెట్ మీద ఆడబోయి కిందపడ్డ రస్సెల్.. కొంచెం అలర్ట్‌గా ఉంటే సింగిల్ వచ్చేదని, మిగతా బంతుల్లో కూడా డబుల్స్ వచ్చేవన్నారు. అప్పుడు చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేస్తే సరిపోయేదని, బౌలర్‌పై కూడా ఒత్తిడి ఉండేదని కానీ రస్సెల్.. భారీ షాట్లతో గెలిపిస్తాననే అత్యుత్సాహంతో జట్టును ఓడించాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Story first published: Thursday, July 15, 2021, 14:41 [IST]
Other articles published on Jul 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+