For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: డమ్మీ ద్రవిడ్ డకౌటయ్యాడు.. చతేశ్వర్ పుజారాపై పేలుతున్న సెటైర్స్!

 Netizens brutally trolled Cheteshwar Pujara after he fails to open his account against SA

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలోనూ టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఆదివారం ప్రారంభమైన ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా(0) దారుణంగా విఫలమయ్యాడు. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన పుజారా.. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంతిని అంచనా వేయడంలో పుజారా విఫలమవ్వగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కీగన్ పీటర్సన్ ఏ తప్పు చేయకుండా బంతిని అందుకున్నాడు. దాంతో పుజారా నిరాశగా వెనుదిరిగాడు. ఇక పుజారా వైఫల్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

డమ్మీ ద్రవిడ్ డకౌట్..

దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ తర్వాత నయావాల్‌గా గుర్తింపు పొందిన పుజారా.. వరుసగా విఫలమవుతుండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయావాల్ పుజారాను డమ్మీ ద్రవిడ్‌గా పిలుస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. డమ్మీ ద్రవిడ్ డకౌటయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు అవకాశం ఇస్తున్నారని, ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను కాదని, తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారికి అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ సీనియర్ల ట్యాగ్‌తో భారత క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సత్తా చాటే ఆటగాళ్లకే అవకాశాలివ్వాలంటున్నారు.

సీఎస్‌కే క్యాంప్‌లోనే..

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు పుజారా ప్రాతినిథ్యం వహించగా.. అదే జట్టుతో ఉన్న లుంగి ఎంగిడి అతని బలహీనతను పసిగట్టాడని, సీఎస్‌కే నెట్స్‌లోనే అతని వికెట్ కోసం వ్యూహం రచించినట్టున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. భారత జట్టులో పుజారాతో పాటు రహానే ఇద్దరూ చోకర్సేనని, వారు ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడటం ఇప్పటి వరకు చూడలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ఇద్దరూ.. ఇతర బ్యాట్స్‌మన్‌కు సపోర్ట్‌గా ఉండటం లేదా? వ్యక్తిగతంగా ఆడటం తప్పా.. జట్టు కోసం ఆడింది లేదని సదరు నెటిజన్ విమర్శించాడు.

అసలు పుజారా ఎందుకో..

అసలు పుజారా ఇంకా జట్టులో ఎందుకు ఉన్నాడని, గత కొన్ని నెలలుగా అతను తీవ్రంగా సతమతమవుతున్నాడని, అతని స్థానంలో విహారీ లేదా శ్రేయస్ అయ్యార్‌ను ఆడించవచ్చు కదా? అని మరో అభిమాని ప్రశ్నించాడు. పరుగులు చేయాలని ఆకలితో ఉన్న విహారి, అయ్యర్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టి.. వరుసగా విఫలమవుతున్న పుజారాకు అవకాశం ఇవ్వడం ఏందో అస్సలు అర్థమవ్వడం లేదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్‌ను పుజారాకు ప్రత్యామ్నాయంగా సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు.

నిలకడగా భారత్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60), కేఎల్ రాహుల్(177 బంతుల్లో 11 ఫోర్లతో 74 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో శుభారంభం అందుకుంది. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో ఫస్ట్ సెషన్‌లో వికెట్ కోల్పోకుండా 83 పరుగులు చేసింది అయితే సెకండ్ సెషన్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్‌ను.. లుంగి ఎంగిడి వికెట్లు ముందు బోల్తా కొట్టించడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దాంతో 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి విరాట్ కోహ్లీ(73 బంతుల్లో 4 ఫోర్లతో 32 బ్యాటింగ్) రాగా.. రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా సెకండ్ సెషన్ ముగించారు.

Story first published: Sunday, December 26, 2021, 19:01 [IST]
Other articles published on Dec 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+