Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా మెంటార్‌గా ధోనీ.. బీజేపీకి గంభీర్‌ రాజీనామా! నెట్టింట పేలుతున్న మీమ్స్, సెటైర్స్!

Netizens brutally roast Gautam Gambhir as MS Dhoni named India’s mentor for T20 World Cup 2021
Probably Saddest Person Right Now | T20 World Cup 2021 Squad || Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టు కోసం ఎదురుచూసిన అభిమానులకు, విశ్లేకులకు బీసీసీఐ ఊహకందని ఆనందాన్ని కలిగించింది. వరల్డ్‌కప్ విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర‌సింగ్ ధోనీని జట్టులోకి తీసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్‌గా పనిచేయనున్నాడు. ఐసీసీ ఈవెంట్స్‌లో కెప్టెన్‌గా ధోనీకి మంచి రికార్డు ఉండటంతోనే జట్టు మార్గదర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్ వరకే..

మెంటార్‌గా ధోనీని నియమించిన విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. ''ప్రపంచకప్‌లో భారత జట్టుకు ధోనీ మెంటార్‌గా ఉంటాడు. ఈ విషయంపై దుబాయ్‌లో అతనితో చర్చించాను. ప్రపంచకప్‌ వరకే ఆ పదవిలో ఉండేందుకు అతను అంగీకరించాడు. ఆ తర్వాత నేను సహచరులతో కూడా మాట్లాడా. మా అందరిదీ ఒకే అభిప్రాయం. కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కూడా మాట్లాడా. ధోనీ జట్టుతో ఉండేందుకు అంతా అంగీకరించారు'' అని జట్టును ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో షా చెప్పుకొచ్చాడు. ధోనీని మెంటార్ ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. జైషా నిర్ణయాన్ని తప్పుబడుతూ గంభీర్.. బీజేపీకి రాజీనామా చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

ఢిల్లీ ఎంపీకి ఎక్కడో కాలుతుంది..

అవకాశం దొరికినప్పుడల్లా ధోనీపై విమర్శలు గుప్పించే గౌతం గంభీర్‌కు బీసీసీఐ నిర్ణయం మింగుడుపడదని, అతనికి ఎక్కడో కాలుతుందని సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. ధోనీ వల్లే తనకు రావాల్సిన పేరు రాలేదనే అసంతృప్తిలో ఉన్న గంభీర్.. అనేకసార్లు భారత మాజీ కెప్టెన్‌పై విమర్శలు గుప్పించాడు. ధోనీ బర్తేడే రోజే ఉద్దేశపూర్వకంగా ఫేస్‌బుక్ కవర్ పేజీ ఫొటోను మార్చాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన కీలక 97 పరుగుల ఇన్నింగ్స్ గుర్తుకొచ్చేలా ఫొటోపెట్టాడు.

శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదిలోనే సచిన్, సెహ్వాగ్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి గట్టెక్కించాడు. కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇలా తాను ఔటవ్వడానికి కూడా ధోనీనే కారణమని పలు ఇంటర్వ్యూల్లో గంభీర్ తెలిపాడు. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఔట్ కావాల్సి వచ్చిందన్నాడు.

ధోనీ ఒక్కడి వల్లే రాలేదు..

ధోని ఒక్కడి వల్లనే భారత్ ప్రపంచకప్ గెలవలేదని, టీమ్ మొత్తం రాణిస్తేనే చిరస్మరణీయ విజయం దక్కిందని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. '2011 వన్డే వరల్డ్‌‌కప్ భారత్ అంతా కలిసి సాధించింది. ముఖ్యంగా భారత జట్టు, సహాయక సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైంది. ధోనీ సిక్సర్ ఒక్కటే విజయాన్నందించలేదు. సమష్టి ఆటతీరువల్లే ఈ విజయం దక్కింది'అని క్రిక్ ఇన్‌ఫో చేసిన ఓ ట్వీట్‌కు గంభీర్ గతంలో బదులిచ్చాడు. ఈ క్రమంలోనే ఇవన్నీ గుర్తు పెట్టుకున్న మహీ అభిమానులు గంభీర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు.

గంభీర్ బర్నాల్ రాసుకో..

ధోనీ మెంటార్ కావడంతో గంభీర్ తట్టుకోలేకపోతున్నాడనే ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. బర్నాల్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ధోనీ ఎదుగుదలను గంభీర్ తట్టుకోలేకపోతున్నాడని, జైషా నిర్ణయాన్ని తప్పుబడుతూ.. బీజేపీకి రాజీనామా చేస్తున్నాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ధోనీ మెంటార్ అయినందుకు దేశమంతా సంతోషిస్తుంటే.. ఒక్క గంభీర్ మాత్రం తట్టుకోలేకపోతున్నాడని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం గంభీర్‌పై పేలుతున్న సెటైర్లు, మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా ధోనీ క్రేజ్ తగ్గకపోవడాన్నీ గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Thursday, September 9, 2021, 12:55 [IST]
Other articles published on Sep 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+