ఓయ్ కోహ్లీ.. వెజిటేరియన్ అని చెప్పి గుడ్లు తింటున్నావా? ఫ్యాన్స్ ఫైర్!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఒక ఫిట్టెస్ట్ అథ్లెట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉన్న కోహ్లీ.. నోరు గట్టుకొని మరి ఫిట్‌నెస్ ఫ్రిక్‌గా మారాడు. దాంతో ఆటలోనూ దుమ్మురేపాడు. వ్యక్తిగతంగానే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిట్‌నెస్ విషయంలో జట్టు స్వరూపాన్నే మార్చాడు. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన డైట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు.
గుడ్లు తింటానని చెప్పడంపై..
తనడైట్‌లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోషాలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని కంట్రోల్‌గా తీసుకుంటానని తెలిపాడు. ఇక గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్ అని గతంలో చెప్పిన కోహ్లీ ఇప్పుడేలా తింటున్నాడని ప్రశ్నిస్తున్నారు. గతేడాది క్వారంటైన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా వేదికగా లైవ్ సెషన్‌లో పాల్గొన్న విరాట్.. తన అనారోగ్య సమస్యల కారణంగా శాఖహారిగా మారినట్లు తెలిపాడు.
యాసిడిటి సమస్యతో..
'2018 సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా నేను వెన్ను నొప్పితో బాధపడ్డాను. అది నా లిటిల్ ఫింగర్‌లో తిమ్మిర్లకు దారి తీసింది. బ్యాటింగ్ చేయడానికి కష్టమైంది. ఇదంతా సెంచూరియన్ టెస్ట్ లో జరిగింది. అంతేకాకుండా యాసిడిక్ సమస్య కూడా ఎదురైంది. నా యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ అవ్వడంతో ఎముకల్లోని కాల్షియంను పొట్ట లాక్కుంది. దాంతో ఈ వెన్నుముక సమస్య ఏర్పడింది. అప్పటి నుంచి మాంసాహారానికి దూరంగా ఉన్నా. ఇప్పుడు అంతా బాగుంది.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓహో.. గుడ్లు నాన్‌వెజ్ కాదా?
శాఖాహారి అని చెప్పి కోహ్లీ గుడ్లు తింటున్నాడని ఒకరంటే.. గుడ్లు నాన్‌వెజ్ కాదనుకుంటా.. అని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లీ కూడా మనలానే మాట తప్పాడని మరొకరు సెటైర్ పేల్చాడు. వెజిటేరియన్ అని చెప్పిన కోహ్లీ ఏంచక్కా గుడ్లు తింటున్నాడని, గుడ్లు తిన్నాక వెజిటేరియన్ ఎలా అవుతాడని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం సిద్దమవుతున్న కోహ్లీ.. ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో క్వారంటైన్ పాటిస్తున్నాడు.

అందుకే వామికా ఫొటోలు..
ఈ చిట్ చాట్‌లో వామికా అంటే దుర్గాదేవి అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని స్పష్టం చేశాడు. ఇక తాను చివరిసారి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ట్రాన్స్‌ఫర్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు చెప్పాడు. కొంచెం ట్రైనింగ్.. ఇంకొంచెం ఫ్యామిలీతో గడుపుతూ క్వారంటైన్‌ను ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఆర్‌సీబీలో చాహల్ చాలా సరదా మనిషని, ఏబీడి తెలివైనవాడని, జెమీసన్ సిగ్గరని తెలిపాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు నమ్మకం..గౌరవమని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications