IND vs SL: ఎంత పనిచేస్తివిరా? ఎంబుల్దెనియా? కోహ్లీ 100వ టెస్ట్‌లో సెంచరీ చేయకపోవడంపై పేలుతున్న సెటైర్లు!

మొహాలీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం గత రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. శ్రీలంకతో మొహాలీ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్.. కోహ్లీకి కెరీర్‌లో 100వ టెస్ట్ కాగా.. ఈ మ్యాచ్‌లో అతను సెంచరీ బాదుతాడని అంతా భావించించారు. కోహ్లీ సైతం తనదైన కవర్ డ్రైవ్స్‌తో అలరిస్తూ సెంచరీ చేసేలా కనిపించాడు. సూపర్ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయాడు. కానీ హాఫ్ సెంచరీ చేరువగా వచ్చిన విరాట్ కోహ్లీ(76 బంతుల్లో 5 ఫోర్లు 45)ని శ్రీలంక స్పిన్నర్ లసిత్ ఎంబుల్దెనియా క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్బ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు.
ఎంత పనిచేస్తివిరా? ఎంబుల్దెనియా..
ఎంబుల్దెనియా వేసిన ఫుల్లర్ లెంగ్త్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ దానికి మూల్యం చెల్లించుకున్నాడు. లసిత్ ఎంబుల్దెనియా ఒకే తరహా ఫుల్లర్ లెంగ్త్ బాల్స్‌తో కోహ్లీని ట్రాప్‌లో పడేసాడు. ఔటవ్వడానికి ముందు కూడా అచ్చం ఇలాంటి బాల్ వేయగా కోహ్లీ ఫ్రంట్‌ఫుట్‌లో ఆడుతూ డిఫెన్స్ చేశాడు. ఆ తర్వాత అదే తరహా బంతిని కాస్త వేగంగా వేయగా.. బ్యాక్ ఫుట్‌లో ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ లైన్ మిస్సయ్యాడు. దాంతో బంతి స్పిన్ అవుతూ వికెట్లను గీరాటేసింది. ఇక కోహ్లీ సైతం ఈ బాల్‌కు బిత్తరపోయాడు. బంతి అలా ఎలా టర్న్ అయిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన రోహిత్..
కోహ్లీ ఇలా ఔటవ్వడాన్ని యావత్ భారతం జీర్ణించుకోలేకపోతుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తలను బాదుకుంటూ టీవీ కెమెరాల్లో కనిపించాడు. కోహ్లీ ఔటవ్వడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఇతర ఆటగాళ్లు సైతం చాలా బాధపడ్డారు. ఇక అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సరదా కామెంట్స్‌తో పాటు నవ్వును తెప్పించే మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. కోహ్లీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ అతను తీవ్రంగా నిరాశపరిచాడని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
అభిమానులు అన్‌సాటిస్‌ఫైడ్..
కోహ్లీ సెంచరీ మళ్లీ చేజార్చుకోవడం బాలేదని, సూపర్ కవర్ డ్రైవ్స్‌తో క్రీజులో కుదురుకొని ఇలా ఔటవ్వడం బాధగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అభిమానులను ఏమాత్రం సంతృప్తిపరచలేదని మీర్జాపూర్ వెబ్ సెరీస్‌లోని సన్నేవేశాలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకొందరయితే కోహ్లీ సెంచరీ చేయకపోవడంతో కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందేరేమో.. ఇప్పుడు చేజారినా రెండో టెస్ట్‌లో ఈ నిరీక్షణకు తెరదించుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విహారి హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఓపెనర్లు రోహిత్ శర్మ(29), మయాంక్ అగర్వాల్(33)త్వరగా ఔటైనా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో టీమిండియా మెరుగైన స్కోర్ దిశగా సాగుతోంది. కోహ్లీ, విహారీ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో 59 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(25 బ్యాటింగ్), రిషభ్ పంత్(23 బ్యాటింగ్) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications