
అసలేం జరిగిందంటే..
ఈ ఐపీఎల్ సీజన్ కోసం కొత్తగా రూపొందించిన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై ఉన్న ఓ మద్యం కంపెనీ లోగోను తన కోసం తీసేయాలని మొయిన్ అలీ టీమ్‌మేనేజ్‌మెంట్ కోరినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు సీఎస్కే యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో మొయన్ అలీపై తస్లీమా నస్రీన్ అతనిపై తన అక్కసును వెళ్లగక్కింది. 'మొయిన్ అలీ క్రికెట్‌లో స్టక్ కాకుంటే.. కచ్చితంగా సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు'అని అభ్యంతరక రీతిలో ట్వీట్ చేసింది.
ముస్లిం అయితే టెర్రరిస్టా?
ఇక తస్లీమా ట్వీట్‌పై నెటిజన్లు అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం అయినంత మాత్రాన టెర్రరిస్ట్ అవుతారా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, ఇతరులను మాత్రం బలవంతంగా, గుడ్డిగా అనుసరించడం లేదు కదా? అని తస్లీమాను నిలదీస్తున్నారు. పాకిస్థాన్ సంతతి, గడ్డం పెంచుకునేందుకే అతను టెర్రరిస్ట్ అయ్యేవాడా? అని ఇంకొందరూ కామెంట్ చేస్తున్నారు. ఇదో బిత్తిరి ట్వీట్ అని, అతను ముస్లిం కావడంతోనే విద్వేశాన్ని చాటుకుంటున్నావని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు శరం లేదా? అనే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం తస్లీమా ట్వీట్‌పై దుమారం రేగుతోంది.
తస్లీమాకు కొత్తేం కాదు..
ఇలా ఒకర్ని, ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, ప్రజల ఆగ్రహానికి గురవ్వడం తస్లీమాకు కొత్తేం కాదు. గతంలో చాలా సార్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆమె ఆ వర్గం నుంచి బెదిరింపులకు కూడా గురయ్యారు. ఈ తరహా ప్రవర్తనతోనే బంగ్లాదేశ్‌ను వీడిన ఆమె.. ప్రస్తుతం స్వీడన్‌లో ఉంటున్నారు. అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్నారు. ఇక తస్లీమా గతంలో బహిరంగ హస్తప్రయోగం చేయడం తప్పేం కాదనే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

ఆర్‌సీబీ టూ సీఎస్‌కే..
గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన మొయిన్ అలీ.. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలానికి ముందు ఆర్‌సీబీ అతన్ని వదిలేసుకోగా.. సీఎస్‌కే రూ.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ముంబైలోని సీఎస్‌కే క్యాంప్‌లో ఉన్న మొయిన్ అలీ.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం సన్నదం అవుతున్నాడు. భారత్ జరిగిన సిరీస్‌లో జోష్ కనబర్చాడు. అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












