'రాజీ అస్సలు పడొద్దు.. క్రికెటర్లకి ప్రతిరోజూ వైరస్ పరీక్షలు నిర్వహించాలి'

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ సమయంలో క్రికెటర్లకి ప్రతిరోజూ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) సహ యజమాని నెస్ వాడియా డిమాండ్ చేశారు. యూఏఈలో ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు.

రోజూ కరోనా పరీక్షలు నిర్వహించాలి:
'ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్‌లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదు' అని నెస్ వాడియా అన్నారు. కరోనా పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలన్నారు.

స్పాన్సర్లకు ఇదే సరైన సమయం:
కరోనా వైరస్ కష్టకాలంలో ఐపీఎల్‌కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. నిజానికి స్పాన్సర్లు అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదన్నారు. 'గతంలో ఏ ఐపీఎల్‌కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్‌కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణం' అని పంజాబ్ యజమాని పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్‌ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని నెస్ వాడియా వ్యక్తం చేశారు.

ఆగస్టు 20 నాటికి:
యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2020కి తమ క్రికెటర్లని పంపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక బోర్డులు కూడా అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఆగస్టు 20 నాటికి ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లందరూ యూఏఈకి చేరుకోవాలని ఇప్పటికే బీసీసీఐ ప్రాథమికంగా ఆదేశాల్ని జారీ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

క్వారంటైన్‌లో 14 రోజులు:
టోర్నీకి నెల రోజుల ముందే యూఏఈకి చేరుకోనున్న క్రికెటర్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ క్వారంటైన్ సమయంలోనే రెండు సార్లు వారికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి నెగటివ్ అని తేలితేనే.. జట్టు తో కలిసేందుకు అనుమతిస్తారు. కానీ టోర్నీ సాంతం ప్రతిరోజూ క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నెస్ వాడియా అంటున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నందున బయో సెక్యూర్ వాతావరణం క్రియేట్ చేయడం అసాధ్యం అని బీసీసీఐ అంటున్న విషయం తెలిసిందే.
అచ్చం ధోనీలాగే.. రషీద్ ఖాన్ హెలికాప్టర్ షాట్ ఇరగదీశాడుగా (వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications