Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

6 బంతుల్లో 6 సిక్సర్లు..! (వీడియో)

నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ అయిరీ చరిత్ర సృష్టించాడు. క్రికెట్‌లోనే అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాది తన పేరిట కొత్త రికార్డ్ లిఖించాడు. ఖతార్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ నేపాల్ బ్యాటర్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఖతార్ పేసర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో 6 సిక్సర్లు కొట్టి అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్‌గా దీపేంద్ర నిలిచారు.

గతంలో యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ ఈ ఘనతను అందుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదగా.. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కీరన్ పోలార్డ్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Nepal cricketer Dipendra Singh Airee Creates History Becomes Third Cricketer To Hit Six Sixes in T20Is

తాజాగా దీపేంద్ర సింగ్ ఈ జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 64 పరుగులతో దీపేంద్ర సింగ్ అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం దీపేంద్ర సింగ్ సిక్స్ సిక్సెస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన రికార్డు కూడా దీపేంద్ర సింగ్ పేరిటనే ఉండటం గమనార్హం. గతేడాది చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో దీపేంద్ర సింగ్.. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, April 13, 2024, 20:14 [IST]
Other articles published on Apr 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+