అలా చేసుంటే భారత్‌ను ఓడించేవాళ్లం: నేపాల్ కెప్టెన్
పల్లెకెలె: మరో 30 పరుగులు అదనంగా చేసుంటే టీమిండియాను ఓడించేవాళ్లమని నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో సోమవారం జరిగిన వన్డేలో నేపాల్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా నేపాల్ అద్భుత పోరాటం కనబర్చింది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించి రోహిత్ పౌడెల్.. మిడిలార్డ్ బ్యాటర్లు రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు. 'మా ఓపెనర్లు అసాధారణమైన ప్రదర్శన కనబర్చారు. మిడిలార్డర్ ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. మా లక్ష్యాన్నికి మేం 30 పరుగులు తక్కువగా చేశాం. మిడిలార్డర్ సత్తా చాటి ఉంటే 260-270 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచేవాళ్లం

మా లోయరార్డర్ మాత్రం అద్భుతంగా ఆడింది. గత 4-5 నెలలుగా ఈ ప్రదర్శననే కొనసాగిస్తోంది. బౌలింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లోనూ మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. వర్షం కారణంగా బంతి అస్సలు పట్టు చిక్కలేదు. అయితే భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.'అని రోహిత్ పౌడెల్ చెప్పుకొచ్చాడు.
పసికూన నేపాల్‌పై టీమిండియా కష్టపడే గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన నేపాల్.. ఆ తర్వాత బౌలింగ్‌తోనూ ఇబ్బంది పెట్టింది. కానీ భారత ఓపెనర్లు ఓపికగా ఆడి విజయాన్నందించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్‌కు కలిసొచ్చింది.
అనంతరం వర్షం కారణంగా టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించారు. ఇక భారత్ 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 నాటౌట్), శుభ్‌మన్ గిల్(62 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications