డాక్యుమెంటరీగా టీమిండియా చారిత్రక టెస్టు సిరీస్.. ట్రైలర్ విడుదల!

హైదరాబాద్: భారత క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై గడ్డపై గతేడాది (2020-21) 2-1తో సాధించిన టెస్ట్ సిరీస్ విజయం చిరస్మరణీయమైనది. 2018-19లోనూ టీమిండియా ఆసీస్ గడ్డపై ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించినప్పటికీ.. ఈ విజయం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఎన్నో ప్రతీకూల పరిస్థితుల మధ్య భారత్ ఈ విజయం సాధించింది. ఓటమితోనే ఈ సిరీస్‌ను ప్రారంభించిన భారత్.. ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. అయినా యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో చిరస్మరణీయ విజయాన్నందుకొని యావత్ క్రికెట్ ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలియజేసింది.

36 పరుగులకే ఆలౌట్..
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి పింక్‌బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై అవమానకర రీతిలో ఓడిపోయింది. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన తొలి టెస్టు టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కోహ్లీ పెటర్నిటీ సెలవుపై స్వదేశం వెళ్లడం.. బుమ్రా, మహమ్మద్ షమీలు గాయాలతో ఇబ్బంది పడడంతో ఒక్కసారిగా టీమిండియాకు కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితులో రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఓటమితో దెబ్బతిన్న జట్టును తన నాయకత్వ పటిమతో రహానే తిరిగి నిలబెట్టాడు.

రహానే సారథ్యంలో..
అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి అనంతరం, రహానే సారథ్యంలో టీమిండియా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో గెలుపొందింది. రహానే సూపర్ సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రా కాగా, సిరీస్ డిసైడర్ అయిన కీలక నాలుగో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన టీమిండియా అద్భుత విజయంతో సిరీస్‌ను ముగించింది.

డాక్యుమెంటరీ రూపంలో..
వాస్తవానికి ఓటమి దెబ్బలు తిని మళ్లీ గెలుపు ఎలా దక్కించుకోవాలో టీమిండియాను చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ చారిత్రక సిరీస్‌ను బిగ్‌స్క్రీన్‌పై డాక్యుమెంటరీ రూపంలో చూపించాలనుకున్నాడు దర్శకుడు నీరజ్ పాండే. స్పెషల్ 26, బేబీ, ఎంఎస్ ధోనీ వంటి మంచి అభిరుచి ఉన్న సినిమాలకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. మాములుగానే తన సినిమాలో భావోద్వేగాలను తారాస్థాయిలో చూపించే ఈ దర్శకుడు.. ఈ సిరీస్‌ను కూడా తనదైన శైలిలో డాక్యుమెంటరీగా రూపొందించాడు.
ట్రైలర్ విడుదల..
తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను జూన్ 1న(బుధవారం) ఆ సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన అజింక్యా రహానే, సిరాజ్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారాలు విడుదల చేశారు. నీరజ్ పాండే 'బంధన్ మే తా ధమ్' పేరుతో సిరీస్‌ను నిర్మించాడు.
సిరీస్‌లో జరిగిన సంఘటనలను ఒక అంశాలుగా తీసుకొచ్చి.. మధ్యమధ్యలో రహానే,సిరాజ్‌లు తమ అనుభవాలను పంచుకునేలా ఆసక్తికరంగా ట్రైలర్‌ను కట్‌చేశారు. మొత్తానికి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ట్రైలర్‌ను మించి డాక్యుమెంట్ ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా జూన్ 16 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ప్లామ్ అయిన వూట్ సెలెక్ట్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications