Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Neeraj Chopra: సెక్స్ లైఫ్ గురించి అడిగిన చ‌రిత్ర‌కారుడు.. నీర‌జ్ చోప్రా ఏం చెప్పాడో తెలుసా?

Neeraj Chopra refused to answer the question about his sex life

న్యూఢిల్లీ: గత నెలలో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌ 2020లో జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి భారత దేశంలో అతడో పెద్ద స్టార్‌ అయ్యాడు. యువతకు ఆదర్శప్రాయంగా మారాడు. ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్రలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్‌లో ఒక్క పతకం కూడా సాధించని భారత్‌.. నీరజ్ చోప్రా పుణ్యమాని చరిత్రను తిరగరాసింది. నీరజ్‌ బరిసెను అల్లంత దూరానికి విసరి.. విశ్వ వేదికపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఫైనల్ పోరులో బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో అతడిని ఇంటర్వ్యూల పేరుతో ఇబ్బందికర ప్రశ్నలు అడగటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

హగ్‌ అడిగిన ఆర్జే

హగ్‌ అడిగిన ఆర్జే

జపాన్ నుంచి తిరిగివచ్చిన నీర‌జ్ చోప్రాను ఆగష్టు రెండో వారంలో ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ ఇంట‌ర్వ్యూ చేసింది. పాపుల‌ర్ ఆర్జే మ‌లిష్కా మెండోన్సా వీడియో కాల్ (జూమ్‌ యాప్‌) ద్వారా నీర‌జ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. అయితే ఇంట‌ర్వ్యూ స్టార్ట్ కావ‌డానికి ముందు ఆర్జే మ‌లిష్కా త‌న తోటి ఉద్యోగుల‌తో క‌లిసి ఓ పాత హిందీ పాట‌కు డ్యాన్స్ చేసింది. 'ఉడే జ‌బ్ జ‌బ్ జుల్ఫే తేరీ' సాంగ్‌కు ఆర్జే అమ్మాయిలు స్టెప్పులేశారు. నీర‌జ్ వీడియో కాల్ ద్వారా లైవ్‌లో ఉన్న‌ప్పుడే వాళ్లంతా చిందేశారు. అక్కడితో ఆగకుండా హగ్‌ కూడా అడిగింది. దాంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. మ‌లిష్కా మెండోన్సాతో పాటు ఆ రేడియో స్టేష‌న్ తొల‌గించాల‌ని ఇంకొందరు డిమాండ్ చేశారు.

సారీ సర్‌

ఇటీవల ఒక ఆంగ్ల మీడియా నీరజ్‌ చోప్రాను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఆయన వ్యక్తిగత , క్రీడా జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు కొందరు అడిగారు. ఈ క్రమంలో చరిత్రకారుడు రాజీవ్‌ సేథీ లైన్‌లోకి వచ్చారు. 'అందమైన కుర్రాడివి. నీ సెక్స్‌జీవితాన్ని, అథ్లెటిక్స్‌ ట్రైనింగ్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేసుకొంటున్నావు?' అని ప్రశ్నించారు.

ఇదొక ఇబ్బందికరమైన ప్రశ్నే అయినా.. అథ్లెటిక్స్‌కు ఇది సీరియస్‌ ప్రశ్నే అని పేర్కొన్నారు. దీనికి నీరజ్‌ చోప్రా చాలా హుందాగా స్పందించారు. 'సారీ సర్‌' అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే రాజీవ్‌ సేథీ వదిలిపెట్టలేదు. మరోసారి అదే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ సారి కూడా నీరజ్‌ సహనం కోల్పోకుండా 'ప్లీజ్‌ సర్‌, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయింది' జవాబిచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

నిజమైన స్పోర్ట్స్‌ పర్సన్‌

నీరజ్‌ చోప్రాకు ప్ర‌శ్న వేసిన రాజీవ్ సేథి వైఖ‌రిని చాలా మంది ప్ర‌ముఖులు ఖండించారు. ఈ వీడియోకు శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. 'ఎదుర్కొన్న చెత్త ప్రశ్నలకు కూడా సౌమ్యంగా సమధానం చెప్పిన నీరజ్‌ చోప్రాపై నాకు గౌరవం పెరిగింది. నిజమైన స్పోర్ట్స్‌ పర్సన్‌' అని పేర్కొన్నారు. ఆర్థిక వేత్త సంజీవ్‌ సాన్యాల్‌ స్పందిస్తూ... 'నీరజ్‌ నేషనల్‌ ఐకాన్‌ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అతని వయస్సు, నేపథ్యంతో సంబంధం లేకుండా గౌరవించాలి. ఇలాంటి అగౌరవ ఘటనలు తరచూ చోటు చేసుకోవడానికి పాతుకుపోయిన పక్షపాత ధోరణులే కారణం' అని ట్వీట్ చేశారు. వీరితో పాటు పలవురు నెటిజన్లు ట్విటర్లో రాజీవ్‌ సేథి తీరును తప్పుబట్టారు. ఆయాపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు

నిజానికి నీరజ్‌ చోప్రా మొదటి నుంచి వివాదాస్పద ప్రశ్నల జోలికి వెళ్లడు. ఇంటర్వ్యూల్లో పూర్తి పరిపక్వతతో మాట్లాడతాడు. అతని వయస్సును బట్టి ఏవో ప్రశ్నలు అడిగి కొంటె సమధానాలు కోరే వారు అతని హుందాతనం చూసి అవాక్కవుతారు.

రెండేళ్ల క్రితం ఓ ఆంగ్ల వార్త సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తూ.. 'నీ ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు' అని అడిగారు. అతనికి నీరజ్‌ రెండు చేతులు జోడించి సోదరా.. ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని నవ్వుతూ సూచించారు. ఇటీవల మరో ఆంగ్ల ఛానెల్‌ యాంకర్ కూడా నీరజ్‌ను ప్రేమ గురించి పదేపదే ప్రశ్నించినా.. ఓపిగ్గా ఆ టాపిక్‌ను కట్‌ చేశాడు. ఆర్జే మ‌లిష్కా మెండోన్సా విషయంలోనూ చాలా హుందాగా ప్రవర్తించాడు.

T20 World Cup 2021కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్.. రాజీనామా చేసిన ఇద్దరు దిగ్గజాలు!!

87.58 మీటర్లు విసిరి

87.58 మీటర్లు విసిరి

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో నీరజ్‌ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి.. స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 7 పతకాలు కైవసం చేసుకుంది భారత్.

11 ఏళ్ల వ‌య‌సు అప్పుడే

11 ఏళ్ల వ‌య‌సు అప్పుడే

నీర‌జ్ చోప్రాది హ‌ర్యానాలోని పానిప‌ట్ జిల్లా, ఖాంద్రా గ్రామం. నీర‌జ్ చోప్రా తండ్రి రైతు. చిన్న‌ప్పుడు నీర‌జ్‌కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. కానీ 11 ఏళ్ల వ‌య‌సు అప్పుడే జావెలిన్ మీద ఆస‌క్తి ఏర్ప‌డింది. పానిప‌ట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్.. జావెలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నీర‌జ్‌కు కూడా జావెలిన్ నేర్చుకోవాల‌నే కుతూహ‌లం ఏర్ప‌డింది.

అలాజ‌జ‌ పంచ్‌కుల‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్ట‌ల్‌లో ఉండి జావెలిన్‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు. అత‌డి త‌ల్లి స‌రోజ్ గృహిణి. నీర‌జ్‌కు ఇద్ద‌రు చెల్లెళ్లు ఉన్నారు. నీర‌జ్ చోప్రా 24 డిసెంబ‌ర్, 1997లో జ‌న్మించాడు. ప్ర‌స్తుతం అతడి వ‌య‌సు 23 ఏళ్లు.

Story first published: Monday, September 6, 2021, 17:56 [IST]
Other articles published on Sep 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+