T20 World Cup 2021కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్.. రాజీనామా చేసిన ఇద్దరు దిగ్గజాలు!!

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2021కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సోమవారం మిస్సా ఉల్ హక్, వకార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పాక్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌గా ఉన్న వకార్ యూనిస్‌లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించింది. సరిగ్గా రెండు గంటల అనంతరం అంటే.. 2.30కు ఇద్దరు కోచ్‌లు రాజీమానా చేసి పీసీబీకి భారీ షాక్ ఇచ్చారు.

చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా
ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా మిస్బా ఉల్ హక్ వ్యవహరించారు. ఆ సమయంలో అతనికి కరోనా వైరస్ సోకింది. దీంతో అతను జమైకాలో క్వారెంటైన్‌లో ఉన్నారు. ఆ సమయంలో మిస్బా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.
'వెస్టిండీస్ సిరీస్ తర్వాత జమైకాలో ఐసొలేషన్‌లో ఉన్నాను. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇలాగే కొనసాగితే.. నేను నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేస్తున్నా. ఇది సరైన సమయం కాదని తెలుసు. కానీ నా మనస్సు మున్ముందు ఎదుర్కొనే సవాళ్లకు సిద్ధంగా లేదు. జట్టులోకి కొత్త బృందం వస్తుంది. వారు జట్టును ముందుతీసుకెళుతారు' అని మిస్బా పేర్కొన్నాడు.

ఎన్నడూ ఎలాంటి పరిస్థితులు అనుభవించలేదు
మిస్బా ఉల్ హక్ బాటలోనే తాను కూడా నడవనున్నట్లు వకార్ యూనిస్ తెలిపారు. 'గత 16 నెలల్లో బయో-సెక్యూర్ వాతావరణం తీవ్ర ప్రభావం చూపింది. మేము ఆడే రోజుల్లో ఎన్నడూ ఎలాంటి పరిస్థితులు అనుభవించలేదు. రాబోయే ఎనిమిది నెలలు పాకిస్తాన్ జట్టు బిజీగా ఉండనుంది. ఎప్పటిలానే నేను వారికి మద్దతునిస్తూ, ఉత్సాహపరుస్తూనే ఉంటాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ప్రతి సభ్యుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన బోర్డుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. మిస్బా, నేను కలిసి కోచింగ్ బాధ్యతలు చేపట్టాం. ఇప్పుడు ఇద్దరం రాజీనామా చేస్తున్నాం' అని వకార్ యూనిస్ చెప్పుకొచ్చాడు. ఇక న్యూజిలాండ్‌తో త్వరలో జరిగే సిరీస్‌లకు తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది.

అక్టోబర్ 24న మ్యాచ్
టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పీసీబీ సోమవారం ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఎంపికయ్యారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు.
పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ షార్జీల్ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. ఇక యువ ఆటగాడు అజమ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్ అలీ, కుష్‌దిల్ షా లాంటి కొత్త ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న తలపడనున్నాయి.

పాకిస్తాన్ టీ20 జట్టు ఇదే
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Ravi Shastriకి ఆర్టీ-పీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్.. ఇదో టెస్టుకు దూరం! ఐసొలేషన్‌లోనే అరుణ్, శ్రీధర్!!