Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NED vs SL, CWC 2023: నెదర్లాండ్స్ అసాధారణ పోరాటం.. మరో సంచలనానికి శ్రీకారం!

నెదర్లాండ్స్ vs శ్రీలంక: వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్ టీమ్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టాప్ క్లాస్ టీమ్ అయిన సౌతాఫ్రికాను మట్టికరిపించిన నెదర్లాండ్స్.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన ఆ జట్టు ఏకంగా 263 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది.

సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(82 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 70), లోగన్ వాన్ బీక్(75 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో నెదర్లాండ్స్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు కుప్పకూలింది.

 NED vs SL, CWC 2023: Sybrand Engelbrecht, Logan van Beek take Netherlands to 262

శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(4/49), కాసున్ రజితా(4/50) నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. మహీష్ తీక్షణ(1/44) ఓ వికెట్ పడగొట్టాడు. 21.2 ఓవర్లలో 91 పరుగులకే 6 వికెట్లు తీసిన శ్రీలంక మరో నాలుగు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కట్టడిగా బౌలింగ్ చేసిన కాసున్ రజితా ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్(4), మాక్స్ డీ డౌడ్(16)లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన కొని అకర్‌మెన్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా రజితా దెబ్బతీసాడు. బాస డీ లీడే(6), తేజ నిడమనూరు(9)లను మధుషంక ఔట్ చేశాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(16)ను తీక్షణ పెవిలియన్ చేర్చడంతో నెదర్లాండ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో సైబ్రాండ్, లోగన్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో సైబ్రాండ్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. లోగన్ 68 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. దాంతో నెదర్లాండ్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది.

Story first published: Saturday, October 21, 2023, 15:19 [IST]
Other articles published on Oct 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+