Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NED vs AFG: విచిత్రం.. నలుగురు బ్యాటర్లు రనౌట్!

NED vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లు రనౌటయ్యారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో ఈ విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన ముందు తేలిపోయింది.

46.3 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. సైబ్రాండ్ (86 బంతుల్లో 6 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మ్యాక్స్ ఓ డౌడ్(42) పర్వాలేదనిపించాడు.

NED vs AFG: Afghanistan electric in the field, rattle Netherlands with 4 run-outs in World Cup 2023

అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ(3/28) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్(1/41) ఓ వికెట్ దక్కింది. అఫ్గాన్ సూపర్ ఫీల్డింగ్‌తో నెదర్లాండ్స్ బ్యాటర్లలో నలుగురు రనౌటయ్యారు.

ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్‌తో పాటు కొలిన్ అకెర్‌మన్, సైబ్రాండ్, స్కాట్ ఎడ్వర్డ్స్ వరుసగా రనౌటయ్యారు. ఈ ప్రపంచకప్‌ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో ఇంత మంది బ్యాటర్లు రనౌటవ్వడం ఇదే తొలిసారి.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లో వేస్లీ బర్రెసి(1) వికెట్లు ముందు దొరికిపోయాడు. క్రీజులోకి వచ్చిన కొలిన్‌(29)తో కలిసి మ్యాక్ ఓ డౌడ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించిన అనంతరం అజ్మతుల్లా ఓమార్జాయ్ స్టన్నింగ్ త్రోకు మ్యాక్స్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ కొద్ది సేపటికే రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ సూపర్ ఫీల్డింగ్‌కు కొలిన్ అకెర్‌మన్, సైబ్రాండ్ వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో నెదర్లాండ్స్ 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. చివర్లో ఆర్యన్ దత్ క్రీజులో నిలబడే ప్రయత్నం చేయడంతో 179 పరుగులు చేయగలిగింది.

Story first published: Friday, November 3, 2023, 18:21 [IST]
Other articles published on Nov 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+