Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలాంటి ప్రకటనలతో జాగ్రత్త.. బీసీసీఐ హెచ్చరిక!

నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో అడ్మిషన్లు ఇప్పిస్తామని వచ్చే ప్రకటనలను నమ్మవద్దని భారత క్రికెట్ నియంత్ర మండలి(బీసీసీఐ) సూచించింది. ఇవన్నీ మోసపూరితమైన ప్రకటనలేనని స్పష్టం చేసింది. అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు తప్పుడు మార్గాల ద్వారా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.

ఎన్‌‌సీఏలో చేరడం మెరిట్ ఆధారంగానే ఉంటుందని ఓ ప్రకటనను విడుదల చేసింది. 'ఎన్‌సీఏలోకి ప్రవేశం కల్పిస్తామని కొందరు మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎన్‌సీఏలో చేరే ఆటగాళ్ల వద్ద బీసీసీఐ ఎలాంటి డబ్బులు తీసుకోదు. అయితే ఎన్‌సీఏలో అందరికీ ప్రవేశం ఉండదు.

NCA not open to all: BCCI issues statement against fraudulent advertisements

బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి వచ్చే రిక్వెస్ట్‌ల మేరకు క్రికెటర్లకు ఎన్‌సీఏలో చేర్చుకుంటారు. అంతేకానీ ఇతర ఎజెన్సీ ద్వారా ఆటగాళ్లను తీసుకోం. కాబట్టి ఎన్‌సీఏలో చేర్పిస్తామనే ప్రకటనల పట్ల ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సూచనలు కావాలన్నా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లను సంప్రదించాలి.'అని బీసీసీఐ పేర్కొంది.

రంజీ ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీఐ జారీ చేసినా ఆదేశాలను టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బేఖాతరు చేశాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లందరూ తమ రాష్ట్ర క్రికెట్ బోర్డులకు అందుబాటులో ఉండాలని, దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది.
భారత జట్టులో చోటు కోల్పోయి ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్‌‌లు రంజీ ట్రోఫీ ఆడకుండా ఐపీఎల్ కోసం సన్నదమవుతున్నారు.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన బీసీసీఐ.. ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇషాన్ కిషన్ మాత్రం రంజీ ట్రోఫీ ఆటకుండా దూరంగా ఉన్నాడు. దాంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే బ్యాటింగ్ టెక్నిక్‌లో ఉన్న లోపాలను సరిచేసుకోవడంపై ఇషాన్ కిషన్ ఫోకస్ పెట్టాడని, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా లేడని బీసీసీఐ అధికారులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

Story first published: Friday, February 16, 2024, 21:57 [IST]
Other articles published on Feb 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+