Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Naveen Ul Haq: కోహ్లీ గొప్ప ఆటగాడు.. ఇక మేం దోస్తులం!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ గొప్ప ఆటగాడని కొనియాడిన నవీన్ ఉల్ హక్.. ఇన్నాళ్లు తమ మధ్య జరిగిన గొడవకు ముగింపు పలుకుతున్నామని తెలిపాడు. ఇక నుంచి తాము మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిమానులంతా విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య పోరు ఎలా ఉండబోతుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఈ ఇద్దరూ మాత్రం ఒకరినొకరు హగ్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. తామిద్దరం కలిసిపోయామని ప్రకటించారు. మ్యాచ్ అనంతరం ఈ వ్యవహారంపై స్పందించిన నవీన్ ఉల్ హక్.. కోహ్లీని కొనియాడాడు.

Naveen Ul Haq says Virat Kohli is a Very good player. We both shake hands and we go ahead

'విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. మేం ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. ఇక నుంచి స్నేహితులుగా ఉందామని నిశ్చయించుకున్నాం. మైదానంలో ఏదైతో జరిగిందో అది గ్రౌండ్ లోపల జరిగిందే. బయట మా మధ్య ఎలాంటి గొడవల్లేవ్. ఈ మ్యాచ్ సందర్భంగా మేం ఇద్దరం కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. మా మధ్య ఉన్న బేధాభిప్రాయాలకు ముగింపు పలుకుదామని నిర్ణయించుకున్నాం.'అని నవీన్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్‌ను కోహ్లీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. అతను మైదానంలోకి వచ్చినప్పటి నుంచి కోహ్లీ కోహ్లీ అని అరుస్తూ ఇబ్బంది పెట్టారు. ఇది గమనించిన విరాట్ కోహ్లీ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలే తప్ప ట్రోల్ చేయవద్దని తన సైగలతో అభిమానులను కోరాడు. దాంతో ఫ్యాన్స్ అంతా నవీన్ ఉల్ హక్‌ను కించపరచడం, కామెంట్ చేయడం ఆపేసారు.

ఇక నవీన్ ఉల్ హక్ సైతం విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడుతూ హగ్ చేసుకున్నాడు. కోహ్లీ సైతం నవ్వుతూ అతన్ని దగ్గరికి తీసుకున్నాడు.

విరాట్ కోహ్లీ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కోహ్లీ గొప్ప వ్యక్తి అనడగానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక నవీన్ ఉల్ హక్, కోహ్లీ హగ్ చేసుకున్న ఫొటోను.. బ్యూటీ ఆఫ్ ది క్రికెట్‌గా అభివర్ణిస్తున్నారు.

Story first published: Thursday, October 12, 2023, 6:15 [IST]
Other articles published on Oct 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+