Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

National Sports Awards 2023: మహమ్మద్ షమీకి అర్జున.. సాత్విక్-చిరాగ్‌కు ఖేల్‌రత్న!

National Sports Awards 2023: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డ్ వరించింది. జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు ఈ పురస్కారాలు లభించాయి.

మొత్తం 26 మంది క్రీడాకారులు అర్జున అవార్డ్‌కు ఎంపికవ్వగా.. బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన టీమిండియా డబుల్స్ జోడీ చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డ్ దక్కింది. ఈ అవార్డులను జనవరి 9న రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.

National Sports Awards 2023: Mohammed Shami won the Arjuna Award

ఈ సారి స్పోర్ట్స్ అవార్డుల్లో క్రికెట్ విభాగం నుంచి మహమ్మద్ షమీకి మాత్రమే అవార్డు దక్కింది.

గతంలో అర్జున అవార్డును క్రికెట్ విభాగం నుంచి శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అందుకున్నారు. 2013లో కోహ్లీకి ఈ అవార్డు వరించగా.. 2015లో రోహిత్ శర్మ, 2014లో రవిచంద్రన్ అశ్విన్, 2019లో రవీంద్ర జడేజా, 2021లో శిఖర్ ధావన్‌లు ఈ అవార్డ్ స్వీకరించారు.

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన షమీ 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్న అతను.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డ్ విన్నర్స్:
1.చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి(బ్యాడ్మింటన్)
2. రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్(బ్యాడ్మింటన్)

అర్జున అవార్డ్ విన్నర్స్:

1. మహమ్మద్ షమీ(క్రికెట్)
2. ఓజాస్ ప్రవీణ్ దియోటలే(ఆర్చరీ)
3. అదితి గోపించ్ స్వామి(ఆర్చరీ)
4. పారుల్ చౌదరీ(అథ్లెటిక్స్)
5. మహమ్మద్ హుసాముద్దీన్(బాక్సింగ్)
6.ఆర్ వైశాలీ(చెస్)
7.ఎం శ్రీ శంకర్(అథ్లెటిక్స్)
8.అనుషా అగర్వల్లా(ఈక్వెస్ట్రియన్)
9. దివ్యకృతి సింగ్(ఈక్వెస్ట్రియన్ డ్రెస్సెజ్)

10. దీక్షా దాగర్(గోల్ఫ్)
11. కృషణ్ బహదూర్ పాఠక్(హాకీ)
12.పుఖ్రంబం సుశీల చాను(హాకీ)
13. పవన్ కుమార్(కబడ్డీ)
14. రీతు నేగి(కబడ్డీ)
15 నస్రీన్(ఖోఖో)
16. పింకీ(లాన్ బౌల్స్)
17. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్(షూటింగ్)
18. ఈషా సింగ్(షూటింగ్)
19.హరీందర్ పాల్ సింగ్ సంధు(స్క్వాష్)
20.అహిక్రా ముఖర్జీ(టేబుల్ టెన్నిస్)
21. సునీల్ కుమార్(రెజ్లింగ్)
22.అంటిమ్(రెజ్లింగ్)
23. నౌరెమ్ రోషిబినా దేవి(ఉషు)
24. శీతల్ దేవి(పారా ఆర్చరీ)
25.ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి(బ్లైండ్ క్రికెట్)
26.ప్రాచీ యాదవ్(పారా కానోయింగ్)

ద్రోణాచార్య అవార్డులు:
1. గణేష్ ప్రభాకర్(మల్లఖాంబ్)
2. శివేంద్ర సింగ్(హాకీ)
3.మహావీర్ ప్రసాద్ సైనీ(పారా అథ్లెటిక్స్)
4.ఆర్ బీ రమేష్(చదరంగం)
5. లలిత్ కుమార్(రెజ్లింగ్)

ద్రోణాచార్యా లైఫ్ టైమ్ అవార్డులు
1. జస్కీరత్ సింగ్ గ్రేవాల్(గోల్ఫ్)
2.ఈ భాస్కరన్(కబడ్డీ)
3. జయంత్ కుమార్ పుషీలాల్(టేబుల్ టెన్నిస్)

ధ్యాన్‌చంద్ అవార్డులు 2023(లైఫ్‌టైమ్)
1.మంజుషా కన్వర్(బ్యాడ్మింటన్)
2. వినీత్ కుమార్ శర్మ(హాకీ)
3. కవిత సెల్వరాజ్(కబడ్డీ)

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023:

1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్(విజేత)
2.లవ్లీ ప్రోఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్(తొలి రన్నరప్)
3. కురుక్షేత్ర విశ్వ విద్యాలయం(రెండో రన్నరప్)

Story first published: Wednesday, December 20, 2023, 19:32 [IST]
Other articles published on Dec 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+