నేషనల్ డ్యూటీ ఫస్ట్.. ఆ తర్వాతే ఏదైనా: కోహ్లీపై దోషి ఫైర్

ముంబై: పితృత్వ సెలవులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మంగళవారం ఉదయం ఆస్ట్రేలియా నుంచి భారత్ బయలుదేరాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే కోహ్లీ ఇండియాకి వచ్చేస్తున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా అతనికి పితృత్వ సెలవులు మంజూరు చేసింది. దీంతో మిగతా మూడు టెస్టులకు విరాట్ దూరంకానున్నాడు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కొందరు కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు మండిపడుతున్నారు.

కోహ్లీపై ట్రోల్స్:
ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్ మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌కు సిద్దమవుతోంది. అయితే తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లీసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ.. తొలి టెస్టు ఓటమితో బెదిరిపోయి స్వదేశానికి వచ్చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో జట్టుతో ఉండి ఆటగాళ్లలో స్థైర్యం నింపాల్సిన కోహ్లీ.. జట్టును వదిలేసి రావడమేంటి? అని ఇంకొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కోహ్లీ పితృత్వ సెలవులపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

నేషనల్ డ్యూటీ ఫస్ట్:
విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి స్పదించారు. కోహ్లీ నిర్ణయాన్ని అతడు స్వాగతించలేదు. 'భార్య ప్రసవ సమయంతో ఆమె చెంత ఉండాలని ఇప్పుడున్న జనరేషన్ కోరుకుంటోంది. దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేషనల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యం?. దీనిపై సమాధానం చెప్పాలి. ఒకవేళ విరాట్ కోహ్లీ స్థానంలో నేను ఉండింటే.. కచ్చితంగా జట్టుని విడిచి వెళ్లేవాడిని కాదు. నా వరకూ నేషనల్ డ్యూటీ ఫస్ట్.. ఆ తర్వాతే ఏదైనా' అని దిలీప్ దోషి తెలిపారు.

కెప్టెన్ అవసరం చాలా ఉంది:
చట్టబద్ధంగా అలా చేయడాన్ని (పితృత్వ సెలవులపై వెళ్లడం) ఎవరూ ఆపలేరని, క్రికెట్ బోర్డులు కూడా అలాంటి నియమాలు కలిగి లేవని భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి అన్నారు. ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్ అవసరం చాలా ఉందని, ఇలాంటి సమయంలో జట్టును వదిలివెళ్లడం సరికాదన్నారు. కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా కోహ్లీని జట్టు కోల్పోతుందన్నారు. జట్టు బాగా ఆడాలని ప్రార్థిస్తున్నానని దోషి చెప్పుకొచ్చారు. 73 ఏళ్ల దోషి భారత్ తరఫున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. శనివారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

ఓజా చురకలు:
ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా ఇదివరకే స్పందించారు. విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్ డిసెషన్ గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. బీసీసీఐకి ముందే విషయం చెప్పాడని, ఈ విషయంలో ఇంత రాద్ధాంతం అవసరం లేదని నెటిజన్లకు చురకలు వేశారు. కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కెప్టెన్‌గా అజింక్య రహానే మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ జట్టుని నడిపించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
2004లో ఇదే రోజు ధోనీ అరంగేట్రం .. ఆ రనౌట్‌కు 16 ఏళ్లు!!