Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఆర్గనైజర్స్ తప్పిదం.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం!(వీడియో)

ఆసియా కప్ 2025లో భాగంగా జరుగుతున్న భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఆర్గనైజర్స్ ఘోర తప్పిదం చేశారు. వారి తప్పిదం కారణంగా పాకిస్థాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్ల జాతీయ గీతాలాపన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ జాతీయ గీతానికి బదులు మరో పాటను నిర్వాహకులు ప్లే చేశారు. ఆ గీతాన్ని విని పాకిస్థాన్ ఆటగాళ్లు అయోమయానికి గురయ్యారు.

వెంటనే తమ తప్పిదాన్ని గుర్తించిన నిర్వాహకులు సరిచేసుకున్నారు. పాకిస్థాన్ జాతీయ గీతాన్ని ప్లే చేయడంతో సమస్య సద్దుమణిగింది. కానీ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిర్వాహకుల తీరుపై పాకిస్థాన్ నెటిజన్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

National Anthem Blunder Sparks Controversy at India vs Pakistan Asia Cup 2025 Match

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ సైమ్ అయూబ్(0) డకౌటవ్వగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హారీస్(3)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఫకార్ జమాన్(17), సల్మాన్ అలీ అఘా(3)లను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పాకిస్థాన్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 49 పరుగులే చేసింది.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.

పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.

Story first published: Sunday, September 14, 2025, 21:03 [IST]
Other articles published on Sep 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+