Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యశస్వి జైస్వాల్ కాదు.. సూపర్ స్టార్ అయ్యేది అతనే: ఆసీస్ క్రికెటర్

న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రపై ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ 24 ఏళ్ల క్రికెటర్ ప్రపంచ క్రికెటర్‌ను ఏలుతాడని జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో నాథన్ లయన్(4/43, 6/65) న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.

డబ్ల్యూటీసీ చరిత్రలోనే 10 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ మూడో రోజు ఆట అనంతరం మాట్లాడిన నాథన్ లయన్.. రచిన్ రవీంద్ర‌ను ఆకాశానికెత్తాడు. 'రచిన్ రవీంద్ర ఓ అసాధారణ ఆటగాడిలా కనిపిస్తున్నాడు. అతనికి నేను బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. వన్డే ప్రపంచకప్ సందర్భంగా అతని ఆట తీరును నేను బాగా పరిశీలించాను. వరల్డ్ క్రికెట్‌లో అతను కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు.'అని నాథన్ లయన్ అభిప్రాయపడ్డాడు.

Nathan Lyon Feels 24-Year-Old All-Rounder Is Going To Be A Superstar

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రచిన్ రవీంద్ర.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో(56) సత్తా చాటాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్‌ అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రచిన్ రవీంద్ర 54 పరుగులతో అజేయంగా నిలిచాడు.

తమ విజయానికి అడ్డుగా ఉన్న రచిన్ రవీంద్రను పొగడ్తలతో లయన్ బోల్తా కొట్టించాడని, చివరి రోజు ఆరంభంలోనే పెవిలియన్ చేర్చి తమ జట్టు విజయానికి బాటలు వేసాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆసీస్ ఆటగాళ్లు చాలా తెలివైనవారని, వారు అన్ని రకాల మైండ్ గేమ్స్ ఆడుతారని కామెంట్ చేస్తున్నారు.

Nathan Lyon Feels 24-Year-Old All-Rounder Is Going To Be A Superstar

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(275 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. 176 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్లతో కలిసి ఆదుకున్నాడు.

అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ(43) మినహా అంతా విఫలమయ్యారు. 184 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 164 పరుగులకే ఆలౌటైంది. గ్లేన్ ఫిలిప్స్(5/45) సంచలన ప్రదర్శన కనబర్చాడు.

369 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ 196 పరుగులకు కుప్పకూలింది. రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 59), డారిల్ మిచెల్(130 బంతుల్లో 2 ఫోర్లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

టామ్ లాథమ్(8), విల్ యంగ్(15), కేన్ విలియమ్సన్(9), టామ్ బ్లండెల్(0), గ్లేన్ ఫిలిప్స్(1) దారుణంగా విఫలమయ్యారు. టేయిలెండర్ స్కాట్ కుగ్గెల్‌జిన్(26) పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 6 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్‌కు తలో వికెట్ దక్కింది. భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కామెరూన్ గ్రీన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Sunday, March 3, 2024, 10:22 [IST]
Other articles published on Mar 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+