Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన నాథన్ లయన్.. అశ్విన్ రికార్డ్ బద్దలు!

ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 7 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్‌, రవిచంద్రన్ అశ్విన్‌‌లను అధిగమించాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. డబ్ల్యూటీసీ చరిత్రలోనే 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా లయన్ 49 మ్యాచ్‌ల్లో 203 వికెట్లు తీసి అతన్ని అధిగమించాడు. ప్యాట్ కమిన్స్ 47 మ్యాచ్‌ల్లో 200 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉండగా.. అశ్విన్ 195 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మిచెల్ స్టార్క్(168), జస్‌ప్రీత్ బుమ్రా(156) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Nathan Lyon Creates WTC History Becomes The Leading Wicket-Taker In WTC

అంతేకాకుండా శ్రీలంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా కూడా నాథన్ లయన్ నిలిచాడు. ఈ క్రమంలో అతను అశ్విన్‌ను అధిగమించాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ప్రభత్ జయసూర్యను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. శ్రీలంక గడ్డపై నాథన్ లయన్ ఇప్పటి వరకు 39 వికెట్లు తీయగా.. అశ్విన్(38), సయీద్ అజ్మల్(38), షేన్ వార్న్(37), యాసిర్ షా(33) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 654/6 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా(232) డబుల్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(141), జోష్ ఇంగ్లీస్(102) సెంచరీలతో చెలరేగారు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో165 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ(5/63) ఐదు వికెట్లు తీయగా.. నాథన్ లయన్(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Story first published: Saturday, February 1, 2025, 18:11 [IST]
Other articles published on Feb 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+