Nathan Lyon: చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. ఒక్క వికెట్ కోసం ఏడాది నిరీక్షణ!

గబ్బా: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 400 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. దాంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్ (708 వికెట్లు), గ్లెన్ మెక్ గ్రాత్ (563 వికెట్లు) ఆసీస్ తరఫున తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఏడాది నిరీక్షణ..
అయితే నాథన్ లయన్ ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు ఏడాది కాలం వేచి చూశాడు. ఈ ఏడాది జనవరిలో టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడం ద్వారా లయన్ 399 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి మరో వికెట్ తీసేందుకు అతడు పది నెలలకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ఎక్కువగా టెస్టులు ఆడకపోవడం.. గాయాలతో లయన్ దూరమవ్వడం.. ఇక తాను ఆడిన రెండు, మూడు టెస్టుల్లోనూ లయన్ 33 ఓవర్లపాటు బౌలింగ్ చేసినా వికెట్ దక్కకపోవడంతో సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు.

17వ స్థానంలో...
తాజాగా గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయని లయన్.. రెండో ఇన్నింగ్స్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఈ నిరీక్షణకు తెరదించాడు. ప్రస్తుతం అతను 403 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు, భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (427 వికెట్లు) 12వ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. లైయన్ సాధించిన ఈ ఘనత పట్ల పలువురు మాజీ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. వీవీఎస్ లక్ష్మణ్, పార్ధివ్ పటేల్ తదితరులు అతన్ని ట్విటర్ వేదికగా ప్రశంసించారు.

ఆస్ట్రేలియా శుభారంభం
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆతిథ్య ఆసీస్.. 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించిన కమిన్స్ సేన.. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. 220/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 77 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది.
దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సాధించిన 19 పరుగుల ఆధిక్యాన్ని ఆసీస్ 5.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ధనాధన్ బ్యాటింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (148 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 152) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులే చేయగా.. ఆస్ట్రేలియా 425 పరుగుల భారీ స్కోర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications