For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2025 పేస్ సెన్సేషన్‌పై కన్నేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు!

వెస్టిండీస్ క్రికెట్‌లో ప్రతిభకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటే ప్రతిభావంతమైన ఆటగాళ్లు ప్రతీ ఏడాది వెలుగులోకి వస్తూనే ఉంటారు. కానీ ఆ ఆటగాళ్లు వెస్టిండీస్ తరఫున ఆడటం కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా నష్టాల్లో ఉండటంతో సంపాదన కోసం ఆటగాళ్లు లీగ్‌ల బాట పట్టారు.

అయితే ఈ ఏడాది వెస్టిండీస్ తరఫున మరో పేస్ సెన్సేషన్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన నాథన్ ఎడ్వర్డ్స్.. సంచలన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ మూడు మ్యాచ్‌ల్లోనే 6 వికెట్లు పడగొట్టాడు.

ప్రత్యేకమైన బౌలింగ్ శైలిలో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. మిచెల్ స్టార్క్, మిచెల్ జాన్సన్ వంటి దిగ్గజ లెఫ్టార్మ్ బౌలర్ల తరహాలో చెలరేగుతున్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్నాడు. అతని బౌలింగ్ శైలిని చూసి క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో గొప్ప బౌలర్ అవుతాడని కితాబిస్తున్నాడు.

Nathan Edwards s Electric Pace in CPL 2025 Wins Over Fans Draws Comparisons to Starc

అయితే ఈ విండీస్ నయా సెన్సేషన్.. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోట్లు కొల్లగొడుతాడని, అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్‌కేతో పాటు కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీలు నాథన్ ఎడ్వర్డ్స్ కోసం పోటీపడే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎస్‌కే ఎడ్వర్డ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎస్‌కే మతీష పతీరణ ఉండగా.. అతనికి అండగా రాణించే బౌలర్ కరువయ్యాడు. దాంతోనే ఎడ్వర్డ్‌ను తీసుకోని బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనలో సీఎస్‌కే ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Friday, August 22, 2025, 14:46 [IST]
Other articles published on Aug 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+