Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Natasa Stankovic: టీమిండియాకు ప్రపంచకప్.. స్పందించని హార్దిక్ సతీమణి!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంసారం ఇంకా కుదురుకోనట్లుంది. అతని సతీమణి నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా‌కు విభేదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అటు హార్దిక్ పాండ్యా గానీ ఇటు నటాషా స్టాంకోవిచ్ గానీ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టీవ్‌గా ఉండే నటాషా.. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచినా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. తన భర్త హార్దిక్ పాండ్యా అసాధారణ ప్రదర్శన గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మలు సోషల్ మీడియా వేదికగా టీమిండియా విజయంపై స్పందించారు.

Natasa Stankovic s silence on India T20 World Cup win renews rift rumours with Hardik Pandya

తమ భర్తల అసాధారణ ప్రదర్శనలను కొనియాడారు. నటాషా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఐపీఎల్ ముందు నుంచే హార్దిక్ పాండ్యాకు ఆమెకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తన పేరులోని పాండ్యాను తొలగించడం, హార్దిక్ ఫొటోలను తొలగించడం వారి విడాకుల వార్తలకు బలం చేకూర్చాయి.

గతంలో హార్దిక్ పాండ్యా ఆడే ప్రతీ మ్యాచ్‌కు వచ్చి అతనికి మద్దతు తెలిపిన నటాషా.. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ఒక్క మ్యాచ్‌కు హాజరవ్వలేదు. ఐపీఎల్ సందర్భంగా హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగినా ఒక్క మాట అనలేదు. నటాషా పుట్టిన రోజు(మార్చి 4) హార్దిక్ పాండ్యా ఆమెకు విషెస్ కూడా తెలియజేయలేదు.

ఈ ఇద్దరికి ఓ బాబు జన్మించగా.. అతనికి అగస్త్యా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆ కుర్రాడు నటాషాతోనే ఉన్నట్లు తెలుస్తోంది. నటాషా చేసే పోస్ట్‌లపై హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా, అతని సతీమణి పంకూరి మాత్రం కామెంట్ చేస్తున్నారు.

అయితే హార్దిక్-నటాషా విడిపోవడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. హార్దిక్ పాండ్యాకు తెలియకుండా నటాషా తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. బాలీవుడ్ గాసిప్స్ చెప్పే ఉమైర్ సంధూ సైతం నటాషా సీక్రెట్ ఎఫైర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దుబాయ్‌లో ఓ హోటల్లో నటాషా.. తన బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తుండగా.. హార్దిక్ పాండ్యాకు దొరికిందని పేర్కొన్నాడు. ఈ కారణంతోనే నటాషాను హార్దిక్ దూరం పెట్టాడని ప్రచారం జరుగుతోంది.

Story first published: Monday, July 1, 2024, 17:05 [IST]
Other articles published on Jul 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+