హార్దిక్ ఒడిలో నటాషా.. ఇంట్లోనే ఉండాలంటూ ఫ్యాన్స్‌కు సూచన.!

హైదరాబాద్: కరోనా కల్లోలంతో దేశం మొత్తం 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు క్రీడారంగం కుదేలవ్వగా.. సినిమారంగం స్థంభించింది. అటు టోర్నీల్లేవ్.. ఇటు షూటింగ్‌ల్లేవ్.. పైగా అందరు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకేముంది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, అతని ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ ఈ క్వారంటైన్ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
క్వారంటైన్‌లో రొమాన్స్..
అంతేకాకుండా.. ఈ క్వారంటైన్ కాలాన్ని తాము ఎలా ఆస్వాదిస్తున్నామో ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. వారిని కూడా ఇలా ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హార్ధిక్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ నటాషా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
స్టార్ క్రికెటర్లంతా తమ క్రికెట్ భాషాలో బయటికి వెళ్తే రనౌట్ అవుతారు.. కరోనా చేతిలో మన్కడింగ్‌కు గురవుతారని ఫన్నీగా అభిమానులను హెచ్చరిస్తుంటే..హార్ధిక్-నటాషా జోడీ మాత్రం తమ రోమాన్స్‌తో ఇంట్లోనే ఉండండని సూచిస్తున్నారు.

దుబాయ్‌లో ఎంగేజ్ మేంట్
దుబాయ్‌లో నటాషాతో నిశ్చితార్ధం చేసుకునన హార్థిక్ పాండ్యా ఆమెకు ఓ రింగ్‌ను కూడా బహూకరించాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకొని తమకు ఎంగేజ్‌మెంట్ అయిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించాడు.

సత్యాగ్రహ మూవీతో..
ఇక సెర్బియన్ మోడల్ అయిన నటాషా.. ప్రకాష్ ఝా తెరకెక్కించిన 'సత్యాగ్రహ' అనే సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. 2014-15లో బిగ్ బాస్-8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫేమ్ అయ్యింది. ఆ తర్వాత ఫుక్రె మూవీ నుండి 'మెహబూబా', 'డాడీ' నుండి 'జిందగీ మేరీ డాన్స్ డాన్స్' లాంటి హిట్ సాంగ్స్‌కి స్టెప్పులేసి బాలీవుడ్‌ని షేక్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications