Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాటలు రావడం లేదు.. ఇలా మధ్యలో వదిలి వెళ్లడం బాధగా ఉంది: నటరాజన్

Natarajan says unfortunately have to undergo knee surgery, wish SRH the best

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో జట్టును వదిలి వెళ్లడం బాధగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ నటరాజన్ అన్నాడు. అసలు తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మోకాలి గాయంతో నట్టూ ఈ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ.. నట్టూ మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకుంది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ తమిళనాడు స్టార్.. ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్మురేపాడు. మూడు ఫార్మాట్లలో సూపర్ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

దాంతో ఈ యార్కర్ల కింగ్‌పై సన్‌రైజర్స్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను అందుకోకుండా ఇలా గాయంతో వెనుదిరగడం చాలా బాధగా ఉందని నట్టూ ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఈ సీజన్ మిగతా మ్యాచ్‌లకు దూరమవ్వడం బాధగా ఉంది. గత సీజన్‌లో అద్భుతంగా రాణించి ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటంతో నాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ దురదృష్టవశాత్తు నా మోకాలికి గాయమవ్వడం, సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన సన్‌రైజర్స్ ఫ్యామిలీకి, సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్స్, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. వారంతా నాకు ఎంతో అండగా నిలుస్తూ నన్ను మోటివేట్ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్ సన్‌రైజర్స్ గెలవాలని కోరుకుంటున్నా. టీమ్‌కు నా బెస్ట్ విషెస్'అని నట్టూ చెప్పుకొచ్చాడు.

ఈ లీగ్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే నట్టూ.. 2 వికెట్లు మాత్రమే తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన గత రెండు మ్యాచ్‌లకు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక అతని స్థానంలో ఆంధ్ర బౌలర్ ఎర్ర పృథ్వీరాజ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఏది కలిసి రావడం లేదు. ఓ వైపు ఆటగాళ్ల గాయాలు.. మరోవైపు గెలిచే మ్యాచ్‌ల్లో ఓడటం ఆ జట్టును కలవరపెడుతుంది. మిడిలార్డర్ బలహీనతతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. కేన్ విలియమ్సన్ రాకతో పంజాబ్‌పై గెలుపొంది టోర్నీలో బోణీ కొట్టింది.

Story first published: Friday, April 23, 2021, 18:11 [IST]
Other articles published on Apr 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+