Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nasser Hussain:అది టీమిండియా.. బీ కేర్‌ ఫుల్ బ్రదర్స్.. 36‌కే ఆలౌటయ్యారు.. ఆ తర్వాత సిరీసే గెలిచారు!

Nasser Hussain Warns England; says India were bowled out for 36 but later pulled off a famous series win
IND VS ENG : 36‌ కే ఆలౌటయ్యారు.. సిరీసే గెలిచారు! అదీ Team India అంటే || Oneindia Telugu

లండన్: విజయఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ను ఆ జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నాసర్ హుస్సేన్ హెచ్చరించాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా? అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు.. ఆ తర్వాత ఎలా దుమ్మురేపి సిరీస్ కైవసం చేసుకుందో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలుసన్నాడు. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాలని, ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా లైట్ తీసుకున్నా.. సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దారుణ పరాజయాల అనంతరం అద్భుత విజయాలందుకోవడం ఆ జట్టుకు అలవాటేనని గుర్తు చేశాడు.

లైట్ తీసుకుంటే అంతే..

లైట్ తీసుకుంటే అంతే..

ఇక లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీ విజయాన్నందుకున్న టీమిండియా.. లీడ్స్‌ టెస్ట్‌లో 78 పరుగులకే ఆలౌటై.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా కీలక నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ది టెలిగ్రాఫ్ దినపత్రికకు రాసిన కాలమ్‌లో నాజర్ హుస్సేన్.. ఇంగ్లండ్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీసేనను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన ఫలితాన్ని ప్రస్తావిస్తూ మరి జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

కోహ్లీ విఫలమైనా..

కోహ్లీ విఫలమైనా..

'చిత్తుగా ఓడించాం కదా? అని టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇదే హార్డ్ వర్క్‌ను గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌తో పాటు.. చివరి మ్యాచ్‌ వరకు కొనసాగించాలి. ఈ రెండు మైదానాలు భారత ప్లేయర్లకు సరిగ్గా సూటవుతాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటనలో వారు సాధించి అద్భుత విజయాన్ని గుర్తు చేసుకోవాలి. 36 పరుగులకే ఆలౌటైన తర్వాత కూడా పుంజుకొని సిరీస్ కైవసం చేసుకున్నారు. అది కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలోనే. కాబట్టి మిగతా సిరీస్‌లో కోహ్లీ తడబడినా.. జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. 'అని హుస్సేన్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.

టెక్నిక్ లోపం..

టెక్నిక్ లోపం..

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం ఉందన్నాడు. అలాగే వదిలేయాల్సిన బంతులను ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. 'భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. లీడ్స్ టెస్ట్ మూడో రోజు ఒక స్పెల్‌ ఆడాడు. అయితే అతను ఆడింది పాత బంతితోనని గుర్తుంచుకోవాలి. కొత్త బంతితో ఆడటం కోహ్లీకి చాలా కష్టమవుతోంది. ఎందుకంటే కొత్త బంతి ఆలస్యంగా స్వింగ్‌ అవుతుంది. అందుకే శనివారం (నాలుగో రోజు) అతడు ఎప్పటి మాదిరిగానే ఔటయ్యాడు. కోహ్లీని ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్. విదేశాల్లో ఎక్కువగా విరాట్ ఈ బంతులకే ఔట్ అవుతున్నాడు. మూడో టెస్టులో కూడా ఇలానే పెవిలియన్ చేరాడు.

వదిలేయాల్సిన బంతులు..

వదిలేయాల్సిన బంతులు..

నిజానికి వదిలేయాల్సిన బంతులను విరాట్‌ కోహ్లీ ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కొద్దిగా లోపం కనిపిస్తోంది. బ్యాక్‌ఫుట్‌ పొజిషనింగ్‌ ఇబ్బందులతో జేమ్స్ అండర్సన్‌, ఓలి రాబిన్సన్‌ బంతులను ఆడలేకపోతున్నాడు. వేసేది ఇన్‌ స్వింగరా లేదా ఔట్‌ స్వింగరా గుర్తించలేక బంతిని ఆడాలా వద్దా అని సందేహపడుతున్నాడు. ఏం చేయాలో కోహ్లీకి అర్థమవ్వడం లేదు. ఇంగ్లండ్ తరహా అత్యుత్తమ బౌలింగ్‌ ఆడటం అతనికి ఏమంత సులువు కాదు. స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు ఇక కష్టమే' అని నాసర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 31, 2021, 20:45 [IST]
Other articles published on Aug 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+