
అశ్విన్ ఆడాల్సిందే..
'వరల్డ్ నెంబర్ 2 బౌలర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు ఉన్నాడు. పైగా అతనో గొప్ప బ్యాట్స్‌మన్. ఐదు టెస్టు సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. వాస్తవానికి హెడింగ్లే టెస్టులోనే అశ్విన్‌ను ఆడించాల్సింది. ఎందుకంటే ఇంగ్లండ్‌లో ఐదుగురు ఎడమ చేతివాటం ఆటగాళ్లు ఉన్నారు. అతను ఓవల్‌లో కచ్చితంగా ఆడాలి.
టీమిండియాకు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న పరిష్కారం అశ్విన్‌ను తీసుకోవడం మాత్రమే. ఎవరైనా ఒక పేసర్ స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలి. హెడింగ్లేలో ఇషాంత్ శర్మ ఇబ్బంది పడ్డాడు. బహుశా అతని స్థానంలో యాష్ వచ్చి జడేజాతో కలుస్తాడు. దాంతో జట్టుకు మరింత సమతూకం వస్తుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మరింత డెప్త్ పెరుగుతుంది' అని హుస్సేన్ చెప్పుకొచ్చాడు.

ఫామ్‌లో ఉన్నా..
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసులో అశ్విన్‌కు ఇప్పటి వరకు చోటు దక్కలేదు. అతను తుది జట్టులో లేకపోవడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు అత్యంత అనుభవంతో బౌలింగ్ చేయగలడని పేర్కొంటున్నాడు. యాష్ కేవలం 79 టెస్టుల్లోనే 413 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో హనుమ విహారితో కలిసి టీమిండియాను ఓటమి నుంచి రక్షించాడు.
ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పోరులో శతకం సాధించాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రాణించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కౌంటీ క్రికెట్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. కానీ పిచ్ కండిషన్స్ నేపథ్యంలో భారత జట్టు నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజా.. ఏకైక స్పిన్నర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణమైంది. అశ్విన్ ఆడించాల్సిన పరిస్థి ఏర్పడింది.

లైట్ తీసుకుంటే అంతే..
ఇక నాలుగో టెస్ట్ నేపథ్యంలో హుస్సేన్ ది టెలిగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లను హెచ్చరించాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా? అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు.. ఆ తర్వాత ఎలా దుమ్మురేపి సిరీస్ కైవసం చేసుకుందో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలుసన్నాడు.
కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాలని, ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా లైట్ తీసుకున్నా.. సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దారుణ పరాజయాల అనంతరం అద్భుత విజయాలందుకోవడం భారత జట్టుకు అలవాటేనని గుర్తు చేశాడు.

కోహ్లీ విఫలమైనా..
'చిత్తుగా ఓడించాం కదా? అని టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇదే హార్డ్ వర్క్‌ను గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌తో పాటు.. చివరి మ్యాచ్ వరకు కొనసాగించాలి. ఈ రెండు మైదానాలు భారత ప్లేయర్లకు సరిగ్గా సూటవుతాయి.
అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటనలో వారు సాధించి అద్భుత విజయాన్ని గుర్తు చేసుకోవాలి. 36 పరుగులకే ఆలౌటైన తర్వాత కూడా పుంజుకొని సిరీస్ కైవసం చేసుకున్నారు. అది కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలోనే. కాబట్టి మిగతా సిరీస్‌లో కోహ్లీ తడబడినా.. జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. 'అని హుస్సేన్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












