Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: అది లంక పర్యటనలో కలిసొచ్చింది.. భారత్‌లో బెడిసికొట్టింది: నాసిర్‌ హుస్సేన్

Nasser Hussain slams ECB over Englands rotation policy

లండన్: టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ కోల్పోవడానికి ఈసీబీ ప్రవేశపెట్టిన రొటేషన్‌ పాలసీనే ముఖ్య కారణమని ఆ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. రొటేషన్‌ పాలసీ తప్పుడు నిర్ణయమని, అది ఎప్పుడు కలిసి రాదన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అశ్విన్ వికెట్ల వేట కొనసాగించడంతో చివరి మూడు టెస్టులో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకున్నారు.

శ్రీలంక పర్యటనలో కలిసొచ్చింది

శ్రీలంక పర్యటనలో కలిసొచ్చింది

డైలీ మెయిల్ కోసం రాసిన ఓ కాలమ్‌లో నాసిర్‌ హుస్సేన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'ఆటగాళ్ల రొటేషన్ విధానం అనే నిర్ణయం సరైనది కావొచ్చు కానీ భారత్‌తో సిరీస్‌లో అలా చేయడాన్ని సమర్థించలేను. ఆటగాళ్లను రొటేట్‌ చేయడం అన్ని సమయాల్లో కలిసిరాదు. టీమిండియా పర్యటనకు ముందు శ్రీలంక పర్యటనలో రొటేషన్‌ పాలసీ కలిసి వచ్చింది. అదే టీమిండియాతో సిరీస్‌కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. కీలక ఆటగాళ్లు దూరమయ్యారు' అని హుస్సేన్‌ అన్నాడు.

స్వదేశానికి అలీ, బెయిర్‌స్టోలు

స్వదేశానికి అలీ, బెయిర్‌స్టోలు

'రెండో టెస్టు తర్వాత మొయిన్‌ అలీ స్వదేశానికి వెళ్లిపోయాడు. వాస్తవానికి అతడిని మిగిలిన టెస్టుల్లో ఆడించాలని ఈసీబీ భావించింది. కానీ రొటేషన్‌ పాలసీ ఉండడంతో ఆటగాళ్లు తమ సొంత నిర్ణయాలపై ఆధారపడుతున్నారు. ఇక జానీ బెయిర్‌స్టో విషయంలోనూ ఇలాగే జరిగింది. శ్రీలంకతో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బెయిర్‌స్టో.. టీమిండియా సిరీస్‌ వచ్చేసరికి మాత్రం విఫలమయ్యాడు. మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్న అతను చివరి రెండు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్‌ హుస్సేన్‌ పేర్కొన్నాడు.

రొటేషన్‌ పాలసీనే మా కొంపముంచింది

రొటేషన్‌ పాలసీనే మా కొంపముంచింది

'ఒక రకంగా చెప్పాలంటే.. భారత్ సిరీస్‌లో రొటేషన్‌ పాలసీనే మా కొంపముంచింది. ఇంకో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ 2021 సీజన్‌కు కూడా ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా ఈసీబీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఐపీఎల్‌ 2020 ముగిసి ఆరు నెలలు కాకుండానే మరో సీజన్‌ సిద్ధంగా అది. ఐపీఎల్‌లో పాల్గొంటే.. ఫార్మాట్‌ వేరైనా టెస్టు క్రికెట్‌ ఆడేందుకు కాస్త అవకాశం ఉంటుంది' అని నాసిర్‌ హుస్సేన్‌ చెప్పుకొచ్చాడు. రొటేషన్‌ పాలసీని గతకొంతకాలంగా ఈసీబీ ఫాలో అవుతుంది. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు వరుసగా విశ్రాంతిని ఇస్తూ వస్తోంది. దీంతో కీలక పర్యటనలకు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు.

శుక్రవారమే మొదటి టీ20 మ్యాచ్‌

శుక్రవారమే మొదటి టీ20 మ్యాచ్‌

ఇక భారత్-ఇంగ్లండ్‌ మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది. టెస్ట్ సిరీస్ కోల్పోయి వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్ బెర్త్‌ కూడా పోగొట్టుకున్న ఇంగ్లీష్ జట్టు ఎలాగైనా పొట్టి కప్ పట్టేయాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం ఆటగాళ్లు మోతేరలోని నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. మరోవైపు తొలి టీ20కి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీమిండియా కూడా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.

'గత 2-3 నెలల్లో రిషబ్ పంత్ టీమిండియాకు చేసింది.. మిగతా ఆటగాళ్లు లైఫ్ టైంలో చేయలేరు'

Story first published: Wednesday, March 10, 2021, 15:06 [IST]
Other articles published on Mar 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+