
మరో మార్గం లేదు
తాజాగా నాసర్ హుస్సేన్ డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ... 'భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఆటగాళ్లను బయో బబుల్ సెక్యూర్‌లో ఉంచి ఐపీఎల్ లీగ్ నిర్వహించారు. అత్యంత సురక్షితంగా చెప్పుకొనే బయో బబుల్‌కు కరోనా సెగ తగిలింది. ఈ సమయంలో లీగ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు తాత్కాలిక రద్దు మాత్రమే అని.. పరిస్థితి చక్కబడిన తర్వాత ఐపీఎల్‌ను జరిపి తీరుతామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. నా దృష్టిలో మాత్రం ఈ సీజన్‌ను పూర్తిగా రద్దు చేయడమే ఉత్తమం' అని అన్నాడు.

ఆటగాళ్లు మూర్ఖులు కారు
'ఇప్పటికే పటిష్టమైన బయో బబూల్‌ను దాటి ఆటగాళ్లను చేరినా కరోనా.. భవిష్యత్తులో ఐపీఎల్ నిర్వహించినా అక్కడికి రాదని ఎవరు మాత్రం చెప్పగలరు. ఐపీఎల్ 2021 మళ్లీ నిర్వహించినా విదేశీ ఆటగాళ్లు వస్తారనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వారి కళ్లతో చూశారు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక.. ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయానక పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో లీగ్‌లో పాల్గొనేందుకు ఎలా వస్తారు. ఆటగాళ్లు మూర్ఖులు, కఠినులు కారు. భారత్‌లో ఏం జరుగుతుందో వారికి తెలుసు. ప్రాణవాయువు, ఆస్పత్రుల్లో పడకల కోసం బతిమిలాడుతున్న దృశ్యాలు చూసి వారెలా ఆడగలరు' అని హుస్సేన్ ప్రశ్నించాడు.
23 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్!!

వాయిదా వేయాల్సిందే
'ప్రజలు మరణిస్తుంటే.. ఆటనెలా చూడగలరు. ఆటగాళ్లను నేను విమర్శించడం లేదు. ఏదేమైనా టోర్నీని వాయిదా వేయాల్సిందే. భారత్‌లో నిర్వహించడమే నిర్వాహకులు చేసిన పెద్ద తప్పు. ఆరు నెలల క్రితం యూఏఈలో వారు అద్భుతంగా లీగ్‌ను నిర్వహించారు. అప్పుడు కరోనా తక్కువగా ఉంది. బయో బుడగల విషయంలో రాజీపడలేదు. నిజమే చెప్పడం సులువే. వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో లీగ్ నిర్వహించడం పట్ల ఫీలయ్యే ఉంటారు' అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ డైలీ మెయిల్‌తో చెప్పుకొచ్చాడు. ఆరు నెలల క్రితం యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2020 సక్సెస్
ఐపీఎల్ 2020కు బ్రిటన్‌కు చెందిన రెస్ట్రారా అనే కంపెనీకి బబుల్ బాధ్యతలు నిర్వహించింది. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మైదాన, హోటళ్ల నిర్వాహకులు.. ఇలా లీగ్‌లో భాగమైన అందరినీ బుడగలోకి తీసుకొచ్చింది ఆ కంపెనీ. బయటి వ్యక్తులు ఎవ్వరూ బుడగ లోపలికి రాకుండా అత్యంత జాగ్రత్తగా చూసుకుంది.
అలాగే మూడు వేదికలకే మ్యాచ్‌లు పరిమితం చేశారు. విమాన ప్రయాణాల అవసరం లేకుండా రోడ్డు మార్గాల్లోనే ఒక వేదిక నుంచి మరో వేదికకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా ఎవరికీ వైరస్ సోకకుండా చూసుకుంది. ఇప్పుడు స్వదేశంలో పకడ్బందీగా బబుల్ లేకపోవడం వల్లే ఐపీఎల్ 2021 అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం అందరికీ కలిపి ఉమ్మడి బబుల్ ఏర్పాటు చేయకపోవడమే అసలు సమస్య.


Click it and Unblock the Notifications












