
స్టోక్స్ మంచి పని చేశాడు..
బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నాజర్ హుస్సెన్ సైతం ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. స్టోక్స్ నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు. 'బెన్ స్టోక్స్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో చాలా సక్సెస్ చూశాడు. బెన్ స్టోక్స్ 80 శాతం ఫిట్‌గా ఉన్నా మ్యాచ్‌లను గెలిపించగలడని చాలామంది అనుకుంటారు. వన్డేల్లో 100 శాతం ఆడలేకపోతే అది మిగిలిన ఫార్మాట్లపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది.

కోహ్లీ, కేన్‌ల పరిస్థితిని..
వన్డేల్లో విఫలమైతే వేరే ఫార్మాట్‌లోనూ ఫామ్ కొనసాగించడం కష్టం. ఇప్పుడు విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లకు ఏం జరుగుతుందో చూస్తున్నాం.
వాళ్లు కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏ ఫార్మాట్‌లోనూ పరుగులు చేయలేకపోతున్నారు. బెన్ స్టోక్స్ ఫిట్‌గా ఉన్నప్పుడు చాలా విజయాలు అందుకున్నాడు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించాడు. అయితే ఆఖరి వన్డేలో అతని ఆటతీరు పూర్తిభిన్నంగా అనిపించింది. కొన్ని బంతులు ఎదుర్కొన్న తర్వాత అతను భారీ షాట్స్ ఆడడానికి ప్రయత్నించినట్లు కనిపించింది.

సరైన నిర్ణయం..
క్రీజులో కుదురుకోవడానికి కష్టపడుతున్నట్టు అనిపించింది. ఆఖరి వన్డేలో బెన్ స్టోక్స్ ఆడిన తీరు చూశాక అతను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయమని అనిపించింది. కనీసం మిగిలిన రెండు ఫార్మాట్లపై అతను పూర్తి ఫోకస్ పెట్టడానికి అవకాశం దొరికింది.'అని నాజర్ హుస్సెన్ చెప్పుకొచ్చాడు. ఇక స్టోక్స్ ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
'మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు చాలా కష్టంగా ఉంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి నా శరీరం సహకరించడం లేదు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాను. కాబట్టి నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. అందుకే 11 ఏళ్ల వన్డే కెరీర్‌కు ముగింపు పలకాలి అని అనుకుంటునున్నాను. ఇకపై నా దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని భావిస్తున్నా'అని సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












