For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్!(వీడియో)

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్, ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ ప్రత్యేకమైన బహమతి ఇవ్వనున్నారు. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన క్యాప్‌ను నారా లోకేశ్‌కు ప్రేమతో ఇస్తున్నట్లు తిలక్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు తిలక్ వర్మ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేయగా.. నారా లోకేశ్ స్పందించారు.

తిలక్ వర్మ బహుమతికి నారా లోకేశ్ ఫిదా అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'తమ్ముడూ.. తిలక్ వర్మ ఈ బహుమతి నాకెంతో ప్రత్యేకమైనది. చాలా సంతోషంగా ఉంది. స్వదేశానికి వచ్చాక నీ చేతులతోనే నేరుగా తీసుకుంటా. ఛాంపియన్'అని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ వీడియోలో తిలక్ వర్మ తన క్యాప్‌పై 'డియర్ లోకేష్ అన్న.. నీకు నా ప్రేమలు..'అని రాసి తన సంతకాన్ని చేశాడు.

Nara Lokesh Hails Tilak Varma s Special Gift After Match-Winning Asia Cup Final Knock
Photo Credit: X (twitter)

ఇది నీకే అని రాసినది చదవి వినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌‌ను నారా లోకేష్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం.. గర్వంగా ఉందని మరికొందరు పోస్ట్‌లు పెడుతున్నారు.

ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. టోర్నీ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ కీలక పోరులో చేతులెత్తేసినా.. శుభ్‌మన్ గిల్ నిరాశపర్చినా.. సూర్యకుమార్ యాదవ్ తన వైఫల్యాన్ని కొనసాగించినా.. క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నానంటూ తిలక్ నిలబడి గెలిపించాడు.

Story first published: Monday, September 29, 2025, 15:47 [IST]
Other articles published on Sep 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+