Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికాకు ఘోర పరాభావం.. పసికూన నమీబియా సంచలన విజయం!

ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి" అంటే ఇదేనేమో. వరల్డ్ బెస్ట్ క్రికెట్ టీమ్‌లో ఒకటైన సౌతాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. పసికూన నమీబియా చేతిలో ఘోర పరాభావం ఎదురైంది. జింబాబ్వే, నమీబియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో సఫారీ టీమ్ శుభారంభం చేయలేకపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో నమీబియా సరికొత్త చరిత్రను లిఖించింది.

IND vs SL: కోహ్లీ ఉంటే కథ వేరే ఉండేది బాస్: మాజీ క్రికెటర్

IND vs SL: కోహ్లీ ఉంటే కథ వేరే ఉండేది బాస్: మాజీ క్రికెటర్

అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికాపై నమీబియాకు ఇది రెండో విజయం. గతేడాది జరిగిన ట్రై సిరీస్‌లోనూ నమీబియా 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. దాంతో సౌతాఫ్రికాను రెండు సార్లు ఓడించిన తొలి అసోసియేట్ టీమ్‌గా నమీబియా చరిత్రకెక్కింది. టీ20ల్లో సౌతాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఒకసారి ఓడించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో ఆ జట్టు ఈ విజయం సాధించింది. మరే అసోసియేట్ టీమ్‌ సౌతాఫ్రికాను ఓడించలేదు.

Namibia Shock South Africa to Script History Become First Associate Team to Achieve Remarkable Feat

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్(38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. లౌరెన్ స్టీన్‌కాంప్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రేనెలన్ సుబ్రాయెన్ మూడు వికెట్లు తీయగా.. డాన్ జాన్సెన్, బ్యోర్న్ ఫోర్టుయిన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. న్కోబాని మోకోయెనా, డెవాల్డ్ బ్రెవిస్ తలో వికెట్ తీసారు.

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

Also Read

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

అనంతరం సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. డెవాల్డ్ బ్రెవిస్(50 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) రాణించినా ఫలితం లేకపోయింది. చివరి ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం సౌతాఫ్రికా కొంపముంచింది. అయితే ఈ ముక్కోణపు సిరీస్‌కు సౌతాఫ్రికా ప్రధాన ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు. ద్వితీయ శ్రేణి టీమ్‌తో సౌతాఫ్రికా ఈ సిరీస్ ఆడుతోంది. ఏది ఏమైనా.. సౌతాఫ్రికాపై నమీబియా విజయం హాట్‌టాపిక్‌గా మారింది.

Story first published: Saturday, August 29, 2026, 9:55 [IST]
Other articles published on Aug 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+