Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: మ్యాచ్‌లో మెరిసిన మిస్టరీ గర్ల్.. పిచ్చెక్కిచ్చే ఫొటోలు వైరల్..! అందానికి అభిమానులు ఫిదా

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఓ అమ్మాయి టీవీ కెమెరాల్లో కనిపించింది. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించేలా ఆ అమ్మాయి ఉండటంతో కెమెరామెన్ పదే పదే ఆ యువతిని చూపించాడు. ఇంకేముందు క్షణాల్లో ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మ్యాచ్ పూర్తి కాక ముందే ఆ అమ్మాయి నెటిజన్ల క్రష్‌గా మారిపోయింది.

ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు.. ఆ ఫొటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. పిచ్చెక్కిచ్చే అందమని, ఆమె ముందు బాలీవుడ్ హీరోయిన్ కూడా పనికిరాదని, అందమే అసూయపడేలా ఉందని కవిత్వం చెబుతున్నారు. ఆమె ఎవరో తెలియజేయాలని, ఇన్‌స్టా ఐడీ ఉంటే చెప్పండని ఎక్స్ చాట్‌బాట్ గ్రోక్‌ను గోకుతున్నారు. మరికొందరు మాత్రం కెమెరామెన్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులను ఏ మాత్రం నిరుత్సాహపరచరని, ప్రతీ మ్యాచ్‌లో అందాలను చూపిస్తారని కామెంట్ చేస్తున్నారు. నవ్వుతూ ఉన్న ఆమె ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్ల మనసులను దోచేస్తోంది.

Naina Bhan Meet the Mystery Girl Who Went Viral During India vs Zimbabwe T20 WC 2026 Clash

ఆ మిస్టరీ గర్ల్ ఎవరంటే..?

ఎట్టకేలకు నెటిజన్లు ఈ మిస్టరీ వివరాలను రాబట్టారు.ఆమె పేరు నైనా భాన్. ఆమె క్రికెట్ అభిమాని మాత్రమే కాదు. నటి, ఫిల్మ్ మేకర్, పాడ్‌కాస్టర్. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' లో 'దిల్‌షాద్' పాత్రతో నైనా గుర్తింపు పొందింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'క్లాస్' (స్పానిష్ సిరీస్ 'ఎలైట్' భారతీయ అనుకరణ) లో ఆమె పోషించిన 'కోయల్ కల్రా' పాత్ర ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ నటనకు ఆమె విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను కూడా అందుకుంది.

నటనతో పాటు పాడ్‌కాస్టర్‌గా.. లైఫ్ స్టైల్ కంటెంట్ క్రియేటర్‌గా, సింగర్‌గా కూడా రాణిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ (@nainabee), యూట్యూబ్ (@nainabeee) ద్వారా ఆమె సినిమాలు, ఆరోగ్యం, ముంబై లైఫ్‌స్టైల్ గురించి అప్‌డేట్స్ ఇస్తోంది.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికందర్ రజా తలో వికెట్ తీసారు.

అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్రియాన్ బెన్నిట్(59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 నాటౌట్)తన జోరు కొనసాగించగా.. కెప్టెన్ సికందర్ రజా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడే వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.

Story first published: Friday, February 27, 2026, 10:14 [IST]
Other articles published on Feb 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+