
బోల్ట్‌కు కరోనా:
గతవారం తన 34వ జన్మదినం సందర్భంగా ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణపతక విజేత అయిన ఉసేన్ బోల్ట్ పలువురు ప్రముఖులకు భారీ విందు ఏర్పాటు చేశాడు. ఆ వేడుకల్లో మాస్క్ ధరించకపోవటమే బోల్ట్ కొంపముంచిందని కొందరు భావిస్తున్నారు. ఈ విందుకు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ సహా మరికొందరు హాజరయ్యారు. బోల్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గేల్ వెంటనే అలర్ట్ అయ్యాడు. కరోనా పరీక్ష చేయించుకోగా.. అతనికి నెగటివ్ అని తేలింది. దీంతో విండీస్ బ్యాట్స్‌మన్ ఊపిరి పీల్చుకున్నాడు.

మరో రెండు వైరస్ పరీక్షలు:
రెండు రోజుల క్రితం కరోనా వైరస్ పరీక్ష చేయించుకోగా.. కోవిడ్-19 నెగెటివ్‌గా వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా విండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ గేల్ వెల్లడించాడు. 'కొన్ని రోజుల క్రితం ఫస్ట్ కోవిడ్-19 టెస్టు చేయించుకున్నా. నెగటివ్ అని తేలింది. ప్రయాణానికి (యూఏఈ) ముందు రెండుసార్లు పరీక్షలు చేయించుకుంటే.. ఫలితం నెగెటివ్‌గా రావాల్సి ఉంటుంది' అని గేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

పాజిటివ్‌గా నిర్ధారణ అయితే:
ఒకవేళ క్రిస్ గేల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి దూరమయ్యే అవకాశం ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున గేల్ ఆడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ జట్టు ప్రస్తుతం యూఏఈలో ఉంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విధ్వంసకర ఓపెనర్ ఇప్పుడు పంజాబ్ జట్టుకు ఆడుతున్నాడు. 125 ఐపీఎల్ మ్యాచులలో 4484 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 175 నాటౌట్. ఐపీఎల్‌లో 6 సెంచరీలు, 28 అర్ధ శతకాలు చేశాడు.
'రాత్రుళ్లు పీడకలలు వెంటాడాయి.. ఇంతకుముందులా ఆడుతానా అని ఆందోళనగా నిద్రలేచేవాడిని'


Click it and Unblock the Notifications












