నా వ్యాఖ్యలను వక్రకరించారు.. రైనాను నేను అలా అనలేదు: శ్రీనివాసన్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) యజమాని ఎన్. శ్రీనివాసన్ 24 గంటల్లోపే యూ టర్న్ తీసుకున్నారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. ఆగష్టు 21న యూఏఎ వెళ్లిన రైనా.. వ్యక్తిగత కారణాలు అంటూ గత శనివారం స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే.

శ్రీనివాసన్ యూ టర్న్
తాజాగా చెన్నై ప్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ సీఎస్కేలో సురేష్ రైనా కంట్రిబ్యూషన్‌కు వెల కట్టలేమన్నారు. 'ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు సురేష్ రైనా చేసిన సేవలు అసమానం. రైనా కంట్రిబ్యూషన్‌కు వెల కట్టలేం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. రైనా మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాల్సిన సమయమిది. మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంది. ఇప్పుడు కూడా మేం అతని వెంటే ఉంటాం. నా వ్యాఖ్యల్లో రైనాను తప్పు పట్టలేదు' అని శ్రీనివాసన్ తెలిపారు.

విజయ గర్వం నెత్తికెక్కుతుంది
'క్రికెటర్లు పాత కాలం నాటి స్టార్లులాగా వ్యవహరిస్తుంటారు. అయితే సీఎస్‌కే ఓ కుటుంబం లాంటింది. సీనియర్లందరూ కలసి మెలిసి ఉండటం నేర్చుకోవాలి. నా ఆలోచన ఏంటంటే.. నువ్వు సంతోషంగా లేవనుకుంటే వెళ్లిపోవచ్చు. ఇదే చేయాలని నేను ఎప్పుడు బలవంతం పెట్టను. కానీ ఒక్కోసారి విజయ గర్వం నెత్తికెక్కుతుంది. తను ఎంత డబ్బు నష్టపోతున్నాడో సురేష్ రైనా త్వరలోనే తెలుసుకుంటాడు' అని శ్రీనివాసన్ ఇంతకుముందు అన్నట్టు కథనాలు వచ్చాయి.

మరో బలమైన కారణం
మరోవైపు సురేష్ రైనా యూఏఈ నుండి వెనక్కి రావడంలో హోటల్ గదికి మించిన మరో బలమైన కారణం ఏదైనా ఉండవచ్చని చెన్నై టీమ్ సంబంధిత వ్యక్తి ఒకరు వెల్లడించారు. 'సీఎస్‌కే నిబంధనల ప్రకారం కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు హోటల్‌లో అత్యుత్తమ సౌకర్యాలు ఉన్న గది ఇస్తారు. రైనాకు కూడా ఇలాంటిది ఇచ్చారు. అందులో బాల్కనీ లేకపోవడమనేది మరో అంశం. చెన్నైతో మంచి అనుబంధం ఉన్న రైనా.. చిన్న విషయానికే వెనక్కి వచ్చేస్తారా. కరోనా కేసుల భయమే కాకుండా.. మరో కారణం కూడా ఉండవచ్చు. ఇప్పటికైతే రైనా తిరిగి రాకపోవచ్చు. ఇక చెన్నైతో కూడా ఆట ముగిసినట్లే' అని అభిప్రాయపడ్డారు.
IPL 2020: ఆర్‌సీబీలో అనూహ్య మార్పు.. వికెట్ కీపర్‌గా స్టార్ బ్యాట్స్‌మన్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications