IPL 2020: ఆర్‌సీబీలో అనూహ్య మార్పు.. వికెట్ కీపర్‌గా స్టార్ బ్యాట్స్‌మన్!!

దుబాయ్: ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఇక విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడు ఎడిషన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లింది. 2016లో ఆర్‌సీబీని ఫైనల్‌కు తీసుకెళ్లాడు. గత మూడు సీజన్లలోనూ పాయింట్ల పట్టికలో 8, 6, 8వ స్థానాలతో సరిపెట్టింది. విరాట్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి టైటిల్ విజేతగా నిలవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. అందులో భాగంగా జట్టు కూర్పులో మార్పులు చేయాలని భావిస్తోంది.

వికెట్ కీపర్‌గా ఏబీ?:
గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఆర్‌సీబీ వికెట్ కీపర్ పార్థివ్ పటేలే. ఇప్పుడూ కూడా అతను జట్టులో ఉన్నాడు. అయితే టోర్నీలో అతడి స్థానంలో ఓ బ్యాట్స్‌మన్‌ను తీసుకుని.. వికెట్ కీపింగ్ బాధ్యతల్ని దక్షిణఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు అప్పగించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. దుబాయ్‌లో ప్రస్తుతం సాగుతున్న ప్రాక్టీస్ సెషన్లో డివిలియర్స్ వికెట్ కీపింగ్ చేయడం ఈ దిశగా సంకేతాలిస్తోంది. ఆ జట్టు కోచ్ సైమన్ కటిచ్ సైతం.. ఈ సీజన్లో డివిలియర్స్ వికెట్ కీపింగ్ చేసే అవకాశాలున్నట్లు చెప్పాడు.

కీపింగ్ ప్రాక్టీస్:
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్‌సీబీ క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టింది. సోమవారం తొలుత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన ఏబీ డివిలియర్స్.. అనంతరం వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన పార్థీవ్ పటేల్ కేవలం 373 పరుగులే చేశాడు. వికెట్ కీపర్‌గానూ తేలిపోయాడు. దాంతో ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంలోనే పార్థీవ్ ఫెయిలైతే.. అతని స్థానంలో ఏబీకి బాధ్యతలు కట్టబెట్టొచ్చని ఆర్‌సీబీ ప్లాన్.

వేలంలో ఆచితూచి:
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్.. గతంలో దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్ కీపర్‌గానూ చేశాడు. ఆ సమయంలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ అనుభవంను ఉపయోగించుకోవాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ముందే ప్రణాళికలు రచించింది బెంగళూరు. ఇప్పటికే ఆటగాళ్ల వేలంలో ఓపెనర్ అరోన్ ఫించ్, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్‌లను తీసుకుని జట్టుని బలోపేతం చేసుకుంది. గత కొన్ని సీజన్లుగా బౌలింగ్ విభాగంలో తెగిలిపోతున్న ఆర్‌సీబీని స్టెయిన్, మోరీస్‌లు కచ్చితంగా ఆదుకునే అవకాశం ఉంది.

పక్కా ప్రణాళికలతో:
డేల్ స్టెయిన్, క్రిస్ మోరీస్‌లకు తోడు మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్, పవన్ నెగి, వాషింగ్టన్ సుందర్‌లు కూడా ఉన్నారు. ఈసారి ఆర్‌సీబీ బౌలింగ్ ప్రత్యర్థులకు సవాలే. విరాట్ కోహ్లీ, అరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్, పార్థివ్ పటేల్, మొయిన్ అలీలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. నెగి, సుందర్, దూబే బ్యాటింగ్ కూడా చేయగలరు. మొత్తానికి ఆర్‌సీబీ పక్కా ప్రణాళికలతో యూఏఈ వెళ్లింది.
'తెల్లవారుజాము 3 గంటలకే విరాట్ భాయ్‌ను నిద్ర లేపాలనుకున్నా.. కానీ బయమేసింది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications