తొలి టెస్టు 31తో హిట్.. రెండో టెస్టు 146తో ఫట్
ఉమేశ్‌యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇషాంత్, బుమ్రా డకౌట్‌గా వెనుదిరగటంతో టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, నాథన్ 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నారు. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్‌కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఆసీస్‌ను కట్టడి చేయడంలో విఫలమైయ్యామని
సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా పెర్త్ వేదికమీద విఫలం కావడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టీమిండియా జట్టు పరంగా బాగా పోరాడిందని, కానీ ఆసీస్‌ను నిలవరించడంలో స్వల్పంగా విఫలమయ్యామని అన్నాడు.
పెర్త్ టెస్టులో నేను చేసింది తప్పే: కోహ్లీ

బ్యాటింగ్ ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది
‘మ్యాచ్ పరంగా చూస్తే మాకంటే ఆసీస్ చాలా బాగా ఆడింది. అలాంటి పిచ్ మీద 300లకు పైగా పరుగులు సాధించడం గొప్ప విషయమే. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా గొప్పగా పోరాడింది. రెండో ఇన్నింగ్స్ ఎంతో బాగా సాగింది. భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్ల బాగా నిలువరించగలిగారు. ఈ క్రెడిట్ అంతా షమీకే చెందుతుంది. రెండో టెస్టులో బౌలింగ్ కాస్త బాగా సాగినా బ్యాటింగ్‌లో మెరుగు పడాల్సి ఉందనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా ఆటలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో పరిణతి సాధించారు. అందుకు మొదటి టెస్టు విజయమే ఉదాహరణ.'

నా సెంచరీ వృథా.. మూడో టెస్టే టార్గెట్
'ఇప్పుడు మా దృష్టి అంతా బాక్సింగ్ డే టెస్టు మీదనే. ఆ టెస్టుకోసం మానసికంగా కూడా సన్నద్ధమవ్వాలి. మెల్‌బోర్న్‌లో జరగబోయే ఈ టెస్టులో ఆసీస్‌ను దీటుగా ఎదుర్కొంటాం. రెండు జట్ల మధ్య కఠిన పోటీ ఉంటుంది. మెల్‌బోర్న్ టెస్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. ఆ టెస్టు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. నా సెంచరీకి కూడా పనికి రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ.. దాని గురించి మాట్లాడదలచుకోలేదని అన్నాడు. అది కేవలం మైదానం వరకూ మాత్రమే పరిమితం. మ్యాచ్ గెలవనప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం అసంబద్ధం' అని ముగించాడు.


Click it and Unblock the Notifications

