'నా రిటైర్మెంట్ నా ఇష్టం.. వీడ్కోలు నిర్ణయం ఎవరో సలహాపై ఆధారపడి లేదు'

కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజాపై విమర్శల పర్వం కొనసాగుతోనే ఉంది. ఇటీవల చాలా మంది మాజీలు అతన్ని విమర్శించగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ ఏకంగా చురకలంటించాడు. నా రిటైర్మెంట్ నా ఇష్టం.. రిటైర్మెంట్‌పై నీ సలహా ఏంటి? అని ఘాటుగా హెచ్చరించాడు. రిటైర్మెంట్ నిర్ణయం ఎవరో సలహాపై ఆధారపడి ఉందన్నాడు. గతంలో పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించాలని రమీజ్ సూచించిన విషయం తెలిసిందే.

నా రిటైర్మెంట్ నా ఇష్టం:
తాజాగా మహ్మద్ హఫీజ్ మాట్లాడుతూ... 'రమీజ్ రాజా తన అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛ ఉంది. కానీ నా రిటైర్మెంట్ నిర్ణయం ఎవరో సలహాపై ఆధారపడి లేదు. ఇప్పటికీ పాక్ జట్టు మేనేజ్‌మెంట్ కోరితే త్వరలో ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడేందుకు నేను సిద్ధం. వయసు ఆధారంగా ఆటగాళ్లని జట్టు నుంచి తప్పించకూడదు. జట్టులోకి ఎంపిక, జట్టు నుంచి వేటు అనేది కేవలం ఫిట్‌నెస్, ఫామ్ ఆధారంగానే జరగాలి. ఈ రెండింటినే ప్రామాణికంగా చూడాలి' అని హఫీజ్ అన్నాడు.

గౌరవంగా తప్పుకోవాలి:
గత ఏప్రిల్ నెలలో రమీజ్ రాజా మాట్లాడుతూ... 'మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి గౌరవంగా తప్పుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వాళ్లిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. పాక్ జట్టుకి మేలు చేసినవారవుతారు. చాలా మంది యువ క్రికెటర్లు జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి కొంత మంది సీనియర్ క్రికెటర్లని పక్కన పెట్టి పాక్ జట్టు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది' అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో హఫీజ్, మాలిక్ ఇద్దరూ విఫలమయ్యారు. కీలక సమయాల్లో పెవిలియన్ చేరి తీవ్ర విమ్మర్శలు ఎదుర్కొన్నారు.

55 టెస్టులు, 218 వన్డేలు:
వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశ నుండే పాకిస్తాన్ నిష్క్రమించడంతో హఫీజ్, మాలిక్ సహా అప్పటి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై కూడా ఫాన్స్, మాజీలు మండిపడ్డారు. అప్పటి ఉంది హఫీజ్, మాలిక్‌లు వీడ్కోలు పలకాలని పలువురు సైతం అన్నారు. 2003లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన మహ్మద్ హఫీజ్.. ఇప్పటి వరకు 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 21 సెంచరీలు బాదాడు. మొత్తంగా 12,258 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 246 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 113 టీ20లు ఆడాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత:
మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించే ముందు ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాలనుందని 39 ఏళ్ల హఫీజ్ తెలిపాడు. మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పబోతున్నట్లు హఫీస్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున ఆడటం, అందులో బాగా రాణించడమే తన ప్రధాన లక్ష్యం అని తెలిపాడు. 39 ఏళ్ల మహ్మద్ హఫీజ్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కేవలం వైట్-బాల్ ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కరోనా ఎఫెక్ట్.. కూరగాయలు పండిస్తున్న మాజీ కెప్టెన్!!