For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మావోనితో జాగ్రత్త.. ఒళ్లు దగ్గరపెట్టుకోని ఆడాలి.. ప్రపంచ బ్యాటర్లకు ముత్తయ్య మురళీధరన్ వార్నింగ్!

 Muttiah Muralitharan Warns Batters At T20 World Cup, says Be Very Careful Against Wanindu Hasaranga

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌ ముందు ప్రత్యర్థి దేశాల బ్యాటర్లకు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీలో శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగాతో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. అతన్ని ఏమాత్రం లైట్ తీసుకున్నా.. మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై వానిందు హసరంగా మరింత ప్రమాదకరం అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్‌ టైటిల్‌ను శ్రీలంక గెలవడంలో హసరంగా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 9 కీలక వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేశాడు.

 హసరంగాతో జాగ్రత్త..

హసరంగాతో జాగ్రత్త..

లెజెండ్స్ లీగ్ రెండో ఎడిషన్ కోసం భారత్‌కు వచ్చిన మురళీధరన్.. శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా హసరంగాపై ప్రశంసల జల్లు కురిపించాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో తాను హసరంగా ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. 'హసరంగా గొప్ప టీ20 బౌలర్. గత రెండు మూడేళ్లుగా అతను అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతను కుర్రాడే అయినప్పటికీ ప్రపంచకప్‌లో డేంజరస్ స్పిన్నర్. ఆస్ట్రేలియాలో ఫింగర్ స్పిన్నర్ల కంటే లెగ్ స్పిన్నర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. హసరంగా బౌలింగ్ ఆడటం బ్యాటర్లకు చాలా కష్టం అవుతోంది. ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడాల్సి ఉంటుంది. ఏ మాత్రం లైట్ తీసుకున్నా.. మూల్యం చెల్లించుకోవాల్సిందే.'అని పేర్కొన్నాడు.

మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది..

మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది..

ఇక శ్రీలంక జట్టు ఆసియాకప్ గెలవడంపై మురళీధరన్ సంతోషం వ్యక్తం చేశాడు. 'గత కొన్నేళ్లుగా శ్రీలంక యంగ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతోంది. ఆసియాకప్‌లో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. అత్యుత్తమ జట్టుగా కనిపించిన ఈ యంగ్ టీమ్ ఆసియాకప్ గెలవడానికి అన్ని విధాల అర్హులు. ప్రపంచకప్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలనుకుంటుంది. అత్యంత బలంగా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు క్వాలిఫయర్స్ ఆడి ప్రధాన టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా మేం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతోనే క్వాలిఫయర్స్ ఆడే పరిస్థితి వచ్చింది. కానీ ఆసియాకప్ విజయం మా జట్టుకు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇదే జోరును కొనసాగిస్తూ ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతుందని ఆశిస్తున్నా'అని మురళీధరన్ చెప్పుకొచ్చాడు.

నా కంటే షేన్ వార్న్ గొప్పోడు..

నా కంటే షేన్ వార్న్ గొప్పోడు..

టెస్ట్‌ల్లో 800 వికెట్లు తీసిన మురళీధరన్ ఈఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. ఇక తనకంటే ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గొప్పవాడని మురళీధరన్ చెప్పుకొచ్చాడు. వార్న్ నుంచే తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. అతన్ని తమంతా మిస్సయ్యామని తెలిపాడు. థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లిన షేన్ వార్న్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. లెజెండ్స్ లీగ్‌ సీజన్-2లో భాగంగా నేడు ఇండియా మహరాజస్, రెస్టాఫ్ వరల్డ్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఇండియా మహరాజస్ జట్టును సెహ్వాగ్ నడిపించనుండగా.. రెస్టాఫ్ వరల్డ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు.

Story first published: Friday, September 16, 2022, 18:18 [IST]
Other articles published on Sep 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+