అందుకే ఇషాన్ కిషన్‌ను వదిలేసి నికోలస్ పూరన్‌ను తీసుకున్నాం: సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆ జట్టు అభిమానులు టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఆటగాళ్లను తీసుకోవడం చేతకాలేదని మండిపడ్డారు. రాయలేని పదాలతో బండ బూతులు తిట్టారు. 22 మంది ఆటగాళ్లతో సన్‌రైజర్స్ ఎంపిక చేసిన టీమ్‌పై పెదవి విరిచారు.
ఈ టీమ్‌తో టైటిల్ కొట్టడం దేవుడెరుగు.. గత సీజన్ మాదరి ఘోర పరాభావం తప్పకుంటే చాలని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిలకడలేని నికోలస్ పూరన్‌కు రూ. 10.75 కోట్లు, రిథమ్ కోల్పోయిన భువనేశ్వర్ కుమార్( రూ.4.20 కోట్లు) మళ్లీ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నికోలస్ పూరన్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని తాజాగా ఆ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్ తెలిపాడు.

బడ్జెట్ ధాటిపోవడంతోనే..
స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలం వ్యూహాలను పంచుకున్నాడు. తమ ప్రణాళిక ప్రకారం టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలనుకున్నామని, కానీ అతను బడ్జెట్ ధాటి పోవడంతో వదిలేసామని మురళీధరణ్ తెలిపాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పూర్తి సీజన్ అందుబాటులో ఉంటాడా? అన్న విషయంపై తమకు సందేహాలుండటంతో అతని జోలికి పోలేదన్నాడు. ఈ పరిస్థితుల్లో నికోలస్ పూరన్‌ను తీసుకోవడమే బెస్ట్ అనిపించిందని చెప్పాడు.

మాకు నమ్మకం ఉంది..
‘సన్‌రైజర్స్ ముందు ఇషాన్ కిషన్‌ను కొనాలనుకుంది. కానీ అతని బిడ్ మా బడ్జెట్‌ను క్రాస్ చేయడంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను చూసుకోవాల్సి వచ్చింది. జానీ బెయిర్ స్టో సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడా? అనే విషయంపై మాకు సందేహం కలిగింది. ఈ పరిస్థితుల్లోనే మాకు నికోలస్ పూరన్ సరైన అవకాశంగా అనిపించింది. ఇక పూరన్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతను మాకు మేలు చేస్తాడనే గట్టి నమ్మకంతో ఉన్నాం. అతను భారీ ధర పలకడం చూస్తుంటే.. తామొక్కరమే కాకుండా చాలా జట్లు పూరన్‌ను తీసుకోవాలనుకున్నాయనే విషయం అర్థమవుతోంది.'అని ముత్తయ్య మురళీ ధరణ్ చెప్పుకొచ్చాడు

హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో..
ఇక భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నికోలస్ పూరన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. దాంతో అతనిపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్, మేనేజ్‌మెంట్ ప్రశంసల జల్లు కురిపించింది. పూరన్ క్లీన్ స్ట్రైకింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు నిలకడకు ఫిదా అయ్యామని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. అతన్ని ఆరెంజ్ జెర్సీలో చూసేందుకు ఆగలేకపోతున్నామని పేర్కొంది. మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో పూరన్ 184 పరుగులు చేశాడు. యావరేజ్ 61.33 ఉండగా.. 140.4 స్ట్రైక్‌తో చెలరేగాడు. జట్టుకు విజయాన్ని అందించలేకపోయినా.. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. అతనికి సరైన సహకారం లభించకపోవడంతో విండీస్ విజయాన్నందుకోలేకపోయింది. ఫస్ట్ టీ20లో 61 పరుగులు చేసిన పూరన్.. రెండో టీ20లోనూ 62 పరుగులు, మూడో టీ20లో 63 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications