For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సత్తా అశ్విన్‌కే ఉంది.. లయన్‌కు అంత సీన్ లేదు: ముత్తయ్య మురళీధరన్

Muttiah Muralitharan says Ravichandran Ashwin
Ravichandran Ashwin Is The Only Bowler Can Reach 700-800 Test Wickets : Muttiah Muralitharan

న్యూఢిల్లీ: ప్రస్తుత తరంలో టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్వినే అత్యుత్తమ స్పిన్నరని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌కు మాత్రం అది సాధ్యం కాదన్నాడు. మురళీధరన్‌ తాజాగా టెలిగ్రాఫ్‌కు రాసిన ఓ కాలమ్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

అశ్విన్ ఒక్కడే..

అశ్విన్ ఒక్కడే..

'అశ్విన్‌ ఒక్కడికే 800 వికెట్లు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అతనో అద్భుత స్పిన్నర్‌. అశ్విన్ తప్పితే మరే బౌలర్‌ కూడా ఆ మార్కును అందుకోలేడు. లయన్‌ కూడా ఆ రికార్డును చేరుకునేంత గొప్పగా లేడు. అతనిప్పుడు 396 వికెట్లతో కొనసాగుతున్నాడు. 800 వికెట్లు తీయాలంటే చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది' అని మురళీధరన్‌ ఆ కాలమ్‌లో పేర్కొన్నాడు. టీ20, వన్డే మ్యాచ్‌లు టెస్టు క్రికెట్‌ పరిస్థితుల్ని మార్చాయని చెప్పాడు. అలాగే తాను ఆడే రోజుల్లో టెక్నికల్‌గా బ్యాట్స్‌మెన్‌ ఎంతో బాగా ఆడేవారని, అప్పుడు వికెట్లు కూడా ఫ్లాట్‌గా ఉండేవని చెప్పాడు.

డీఆర్‌ఎస్ ఉండి ఉంటే..

డీఆర్‌ఎస్ ఉండి ఉంటే..

'ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. మా రోజుల్లో వికెట్లు తీయాలంటే బౌలర్లు చాలా కష్టపడేవారని చెప్పాడు. అందుకోసం వైవిధ్యమైన బంతులు ప్రయత్నించేవారు. ఇక ఇప్పుడు సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే వికెట్లు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు అటాకింగ్‌ చేయకుండా ఉండలేరు. దాంతో వికెట్లు తీయడం సులువుగా మారింది. నేను ఆడే రోజుల్లో డీఆర్‌ఎస్‌ ఉండి ఉంటే నా వికెట్ల సంఖ్య 800 కన్నా ఎక్కువే ఉండేది'అని మురళీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, అశ్విన్‌ ప్రస్తుతం 74 టెస్టుల్లో 377 వికెట్లతో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆసీస్‌ స్పిన్నర్‌ లయన్‌ 99 టెస్టుల్లో 396 వికెట్లు తీశాడు.

ఏకైక బౌలర్ మురళీధరన్..

ఏకైక బౌలర్ మురళీధరన్..

ఏకైక బౌలర్ మురళీధరన్..

టెస్టు క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌. శ్రీలంక స్పిన్‌ దిగ్గజం మురళీధరన్‌ 2010లో గాలె వేదికగా భారత్‌తో తన కెరీర్‌ చివరి టెస్టు మ్యాచ్‌లో ఓజాను ఔట్‌ చేయడం ద్వారా ఈ మైలురాయి చేరుకున్నాడు. పదేళ్లలో మురళీధరన్‌ రికార్డుకు చేరువలో ఏ ఒక్క బౌలర్‌ కూడా చేరుకోలేకపోయాడు. ముత్తయ్య తర్వాత ఆసీస్‌ లెజండరీ షేన్‌ వార్న్‌, భారత స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే(619) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Story first published: Thursday, January 14, 2021, 17:38 [IST]
Other articles published on Jan 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+