Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాంత్‌ను కవ్వించి.. 800వ వికెట్‌ ఎలా తీశానంటే: మురళీధరన్‌

Muttiah Muralitharan Recalls Conversation With Ishant Sharma Ahead Of 800th Test Wicket

కొలొంబో: శ్రీలంక లెజండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్‌ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడం మురళీధరన్‌లోని ప్రత్యేక శైలి. అంతర్జాతీయ క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్‌లను సైతం తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించారు. స్పిన్ లెజెండ్ బౌలింగ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. సుదీర్ఘ ఫార్మాట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మాత్రమే. అయితే ఆ 800వ వికెట్‌ ఎలా తీశాడో మురళీధరన్‌ తాజాగా తెలిపాడు.

నువ్వెంత ప్రయత్నించినప్పటికీ భారత్‌ గెలవలేదు

నువ్వెంత ప్రయత్నించినప్పటికీ భారత్‌ గెలవలేదు

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 'డీఆర్‌ఎస్‌ విత్‌ అశ్విన్‌' షోలో ముత్తయ్య మురళీధరన్ తాజాగా పాల్గొని తమిళంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో 800 వికెట్ ఎలా తీశాడో ఆయన గుర్తుచేసుకున్నారు. 'గాలె వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అది లాస్ట్ వికెట్. ప్రజ్ఞాన్‌ ఓజాతో నేనేమీ మాట్లాడలేదు. మంచినీరు తాగిన తర్వాత ఇషాంత్ శర్మ‌తో సరదాగా మాట్లాడాను. ఆఖరి వికెట్‌ కాబట్టి షాట్లు ఆడాలని సూచించా. నువ్వెంత ప్రయత్నించినప్పటికీ.. భారత్‌ గెలవలేదు. కనీసం డ్రా కూడా చేసుకోలేదని చెప్పా. నాకు వికెట్‌ ఇస్తే నేనైనా సంతృప్తి చెందుతాను' అని చెప్పానని తెలిపారు.

ప్రజ్ఞాన్‌ ఓజా వికెట్ తీసుకున్నా

ప్రజ్ఞాన్‌ ఓజా వికెట్ తీసుకున్నా

'నేను అలా అనేసరికి ఇషాంత్ శర్మ బాగా పోరాడాడు. వికెట్‌ ఇవ్వకుండా 15 ఓవర్ల వరకు ఆడాడు. అయితే ప్రజ్ఞాన్‌ ఓజా వికెట్‌ దక్కించుకున్నా. అలా 800వ వికెట్‌ నా ఖాతాలో చేరింది' అని మురళీధరన్ చెప్పారు. టెస్ట్ ఫార్మాట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మాత్రమే. ఆయన రికార్డుకు దరిదాపుల్లో కూడా ప్రస్తుతం ఎవ్వరూ లేరు. గాలె వేదికగా జరిగిన ఆ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 520/8 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత మురళీధరన్‌ 5 వికెట్లతో చెలరేగడంతో.. భారత్‌ 276కు ఆలౌట్ అయి ఫాలోఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సచిన్‌, లక్ష్మణ్‌ పోరాడినా.. భారత్ 338కే కుప్పకూలింది. శ్రీలంక పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఫాస్ట్‌ బౌలింగ్‌కు పనికిరావని

ఫాస్ట్‌ బౌలింగ్‌కు పనికిరావని

మురళీధరన్ తొలుత ఫాస్ట్‌బౌలర్‌గా ఉండేవాడట. కానీ అండర్‌ 13 స్థాయిలో పొడుగ్గా లేనని తన కోచ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కు పనికిరావని చెప్పాడట. ఫాస్ట్‌ బౌలర్‌ అవ్వాల్సిన తాను ఆ మాటతో స్పిన్‌ బౌలర్‌గా మారానని చెప్పారు. అలాగే సహజంగా ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన తాను పాఠశాల స్థాయిలో ఆడేటప్పుడు లెగ్‌ స్పిన్నర్‌గా కొనసాగినట్లు తెలిపారు. అందుకు కారణం తమ స్కూల్లో అప్పటికే ఇద్దరు ఆఫ్‌స్పిన్నర్లు ఉన్నారని, తనకు అవకాశం వచ్చేందుకు వీలుగా బౌలింగ్‌ను మార్చుకున్నానని పేర్కొన్నారు. అలా తాను ఆఫ్‌స్పిన్నర్‌ కంటే ముందు లెగ్ ‌స్పిన్నర్‌గానూ బౌలింగ్‌‌ చేసినట్లు వెల్లడించారు.

495 మ్యాచ్‌ల్లో 1347 వికెట్లు

495 మ్యాచ్‌ల్లో 1347 వికెట్లు

ఆఫ్‌ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో ముత్తయ్య మురళీధరన్‌లోని ప్రత్యేక శైలి. స్పిన్ లెజెండ్ మురళీధరన్‌ బౌలింగ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు. టెస్ట్ ఫార్మాట్‌లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ.. 800 వికెట్లు పడగొట్టారు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు నెలకొల్చారు. మొత్తంగా 495 మ్యాచ్‌ల్లో 1347 వికెట్లు పడగొట్టి కెరీర్‌ను అద్భుతంగా ముగించారు.

CPL 2020: సీపీఎల్ విజేతకు ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

Story first published: Tuesday, August 11, 2020, 13:34 [IST]
Other articles published on Aug 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+