Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: సీపీఎల్ విజేతకు ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

Do you know how much Caribbean Premier League 2020 Title Winner Prize Money

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్​, టొబాగోలో ఈ సీజన్ మ్యాచులు జరుగనున్నాయి. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఇక ఈ టోర్నీలో విజేత‌ల‌కు, ఇత‌రుల‌కు అందించ‌నున్న ప్రైజ్ మ‌నీల వివ‌రాల గురించి తెలుసుకుందామా?!!

సీపీఎల్ 2020 టోర్నీ విజేతకు 1 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీ ఇస్తారు. అదే ర‌న్న‌రప్‌‌కు అయితే 6.60 ల‌క్ష‌ల డాల‌ర్లను బ‌హుమ‌తిగా ఇస్తారు. 3వ స్థానంలో నిలిచిన వారికి 2.50 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను, 4వ స్థానంలో నిలిచిన వారికి ఒక ల‌క్ష డాల‌ర్ల‌ను ఇస్తారు. ప్లేయ‌ర్ల‌కు ప్రైజ్ మ‌నీని 1.50 ల‌క్ష‌ల డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. లాంగెస్ట్ సిక్స్ కొట్టిన వారికి 5వేల డాల‌ర్లు ఇవ్వనున్నారు. టోర్నీ మొత్తం అన్ని ప్రైజ్ మ‌నీ 2.16 మిలియ‌న్ డాల‌ర్లు.

కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో 2019లో కేవ‌లం విజేత‌గా నిలిచిన జ‌ట్టుకే 2.8 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్ మ‌నీ ఇచ్చారు. అంటే సీపీఎల్ మొత్తం ప్రైజ్ మ‌నీ ఐపీఎల్‌ విజేత అంత కూడా లేదు. అయితే ఈసారి ఐపీఎల్ ప్రైజ్ మ‌నీ ఎంత అన్న వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. కాగా గ‌త ఐపీఎల్‌లో మొత్తం ప్లేయ‌ర్ల‌కు అందిన ప్రైజ్ మ‌నీ 7 మిలియ‌న్ డాల‌ర్లు.

సీపీఎల్‌లో ఆడేందుకు ట్రినిడాడ్‌ మరియు టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్‌ అధికారులు, నిర్వాహకులతో కూడిన మొత్తం 162 మందికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని తాజాగా సీపీఎల్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వీరంతా అక్కడి హోటల్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఈ సమయంలో వీరందరికి రెగ్యులర్‌గా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. సీపీఎల్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు అందరూ ఆగస్టు 1నే ట్రినిడాడ్‌ చేరుకున్న విషయం తెలిసిందే.

Story first published: Monday, August 10, 2020, 22:48 [IST]
Other articles published on Aug 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+